Uric Acid: యూరిక్ యాసిడ్ అనేది శరీరంలోని ప్యూరిన్‌ల విచ్ఛిన్నం ద్వారా ఏర్పడే ఒక రసాయనం. సాధారణంగా మూత్రపిండాలు ఫిల్టర్ చేయడం ద్వారా మూత్రాన్ని బయటికి పంపిస్తాయి. అయితే కొన్ని సార్లు మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయని సందర్భాలు ఉంటాయి. అటువంటి సమయంలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడుతాయి. ఇవి విచ్ఛిన్నమై శరీరంలోని కీళ్లలోకి చేరుతాయి. ఎముకలను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆర్థరైటిస్, వాపు, కీళ్ల నొప్పి సమస్యలు ఏర్పడుతాయి. కొన్నిసార్లు యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
పెరిగిన యూరిక్ యాసిడ్ కారణంగా
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. సమయపాలన లేని ఆహార అలవాట్లు, నిద్ర అతిపెద్ద కారణం. రెడ్ మీట్, సీఫుడ్, కాయధాన్యాలు, కిడ్నీ బీన్స్, పనీర్, రైస్, ఆల్కహాల్ మొదలైన వాటిలో అధిక మొత్తంలో ప్యూరిన్స్ ఉంటాయి. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్యూరిన్ మొత్తం పెరుగుతుంది. మూత్రపిండాలు వీటిని క్లీన్ చేయలేకపోతాయి. అటువంటి పరిస్థితిలో దాని స్థాయి శరీరంలో పెరగడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా కొన్నిసార్లు వంశపారంపర్యత, అధిక బరువు, అధిక ఒత్తిడి కారణంగా కూడా శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.
రక్షణ పద్ధతులు ఏమిటి
1. మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే ముందుగా మీ జీవనశైలిని మార్చండి. ఆహారపు అలవాట్లను సరిచేసుకోండి.
2. ఎర్ర మాంసం, కాయధాన్యాలు, బీన్స్, పాలకూర మొదలైన వాటిని తినడం మానెయ్యండి.
3. ఆల్కహాల్ లేదా బీర్ తీసుకునే అలవాటు ఉంటే వెంటనే శాశ్వతంగా ఆపండి.
4. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆహారం తిన్న తర్వాత నడక అలవాటు చేసుకోండి. బరువును అదుపులో ఉంచుకోండి.