AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటింటి కరివేపాకుతో సౌందర్య రహస్యాలు.. రసాయనాలు లేకుండా అందంగా మారండి..!

కరివేపాకు వంటల్లో వాడే సాధారణ పదార్థమే కాదు.. ఇది చర్మ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీని ప్రత్యేక లక్షణాలు చర్మాన్ని సహజంగా మెరిసేలా చేయడమే కాకుండా.. ముడతలు, మొటిమలు, వయసుతో వచ్చే మార్పుల‌ను కూడా నియంత్రించగలవు. కరివేపాకులో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాల పునరుత్పత్తిని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

వంటింటి కరివేపాకుతో సౌందర్య రహస్యాలు.. రసాయనాలు లేకుండా అందంగా మారండి..!
Curry Leaves
Prashanthi V
|

Updated on: Jun 30, 2025 | 8:22 PM

Share

ఆహారంలో రుచికే కాకుండా.. ఆరోగ్య పరంగా కూడా కరివేపాకు గొప్పది. ముఖ్యంగా చర్మానికి సంబంధించిన విషయాల్లో ఇది సహజ చికిత్సల కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ A, C, యాంటీఆక్సిడెంట్‌ ల కారణంగా చర్మంపై తక్షణమే ప్రభావం చూపుతుంది. ఇది మొటిమలను తగ్గించడం, చర్మం వయసు తీరుగా కనిపించేలా చేయడం, అలాగే పిగ్మెంటేషన్‌ను నియంత్రించడం వంటి వాటికి సహాయపడుతుంది.

కరివేపాకు, పసుపు ఫేస్ ప్యాక్

కొన్ని తాజా కరివేపాకు ఆకులను మెత్తగా రుబ్బి పేస్ట్ చేయాలి. ఇందులో కొద్దిగా పసుపు పొడి కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇది ముఖంపై మొటిమలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

కరివేపాకు, పెరుగు ఫేస్ ప్యాక్

రెండు టీ స్పూన్ల కరివేపాకు పేస్ట్‌ కి కొద్దిగా పెరుగు కలిపి మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడపై అప్లై చేసి 15–20 నిమిషాల పాటు ఉంచాలి. ఆరిన తర్వాత కడిగితే ముఖం తేలికగా మెరుస్తుంది. నల్ల మచ్చలు, తేలికపాటి పిగ్మెంటేషన్‌ ను తగ్గించడంలో ఇది మంచి ఫలితాలు ఇస్తుంది.

కరివేపాకు, తేనె ఫేస్ ప్యాక్

కొద్దిగా కరివేపాకు పేస్ట్‌కి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి మెత్తని పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. ఇది చర్మానికి సహజమైన కాంతిని అందిస్తుంది. పొడిబారిన చర్మానికి తేమను ఇస్తుంది.

కరివేపాకు వంటింట్లో తరచుగా కనిపించే సాధారణ పదార్థమే అయినా.. అందులో దాగిన ఆరోగ్య రహస్యాలు చాలా ఎక్కువ. ఈ ఆకుల సహజ శక్తిని మన స్కిన్ కేర్‌ లో భాగంగా తీసుకుంటే.. రసాయనాల నుండి దూరంగా ఉండి ప్రకృతి సహాయంతో ఆరోగ్యవంతమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే వాడాలి)