AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బట్టల ఇస్త్రీకే కాదు.. ఐరన్ బాక్స్‌తో ఇన్ని పనులు చేయొచ్చని మీకు తెలుసా..?

ఇంట్లో ఉండే ఐరన్ బాక్స్‌ను కేవలం బట్టల ముడతలు పోగొట్టడానికే వాడుతున్నారా? అయితే మీరు చాలా మిస్ అవుతున్నట్లే.. దుస్తులను ఇస్త్రీ చేయడమే కాకుండా.. ఇంట్లోని మొండి మరకలను వదిలించడానికి, ఫర్నిచర్ మెరుపును తిరిగి తేవడానికి ఐరన్ బాక్స్ ఓ అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది. కొవ్వొత్తి మైనం మరకల నుంచి పాత స్టిక్కర్ల జిగురు వరకు, చిన్న ట్రిక్స్‌తో ఐరన్ బాక్స్‌ను ఎలా ఉపయోగించవచ్చో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు..

బట్టల ఇస్త్రీకే కాదు.. ఐరన్ బాక్స్‌తో ఇన్ని పనులు చేయొచ్చని మీకు తెలుసా..?
Iron Box Uses
Krishna S
|

Updated on: Sep 28, 2026 | 7:10 PM

Share

ఇంట్లో ఉండే ఐరన్ బాక్స్ అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం బట్టల ముడతలు పోగొట్టడం మాత్రమే. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ఆ వేడి, ఆవిరితో ఇంట్లోని ఎన్నో మొండి సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చు. జిడ్డు మరకలు, పాత స్టిక్కర్ జిగురు, కార్పెట్ లోపాలు వంటి వాటిని తొలగించడంలో ఐరన్ బాక్స్ ఒక అద్భుతంగా ఉపయోగపడుతుంది. సమయం, శ్రమను ఆదా చేసే ఆ ఆసక్తికరమైన చిట్కాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

ఐరన్ బాక్స్‌తో అద్భుతమైన ఇంటి చిట్కాలు

కొవ్వొత్తి మైనపు మరకలకు పరిష్కారం

బట్టలు, డైనింగ్ టేబుల్ క్లాత్ లేదా కార్పెట్‌పై పొరపాటున కొవ్వొత్తి మైనం పడితే దాన్ని గీకడం వల్ల మరక మరింత విస్తరిస్తుంది. మైనం పూర్తిగా చల్లారిన తర్వాత దానిపై ఒక పలుచని పేపర్ లేదా కాటన్ వస్త్రాన్ని ఉంచాలి. ఆ తర్వాత ఐరన్ బాక్స్‌ను తక్కువ వేడి మీద కాసేపు తిప్పితే, వేడికి కరిగిన మైనాన్ని ఆ కాగితం పీల్చేసుకుంటుంది.

క్రేయాన్ రాతల తొలగింపు

చిన్నారులు ఆడుకుంటూ బట్టలు, ఇతర వస్త్రాలపై వేసే క్రేయాన్ గీతల్లో మైనం శాతం ఉంటుంది. మరక ఉన్న భాగంపై ఒక పేపర్‌ను ఉంచి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఐరన్ చేయడం ద్వారా క్రేయాన్ రంగులను సులభంగా తొలగించవచ్చు.

మొండి స్టిక్కర్ల జిగురు మాయం

కొత్త వస్తువులు, ప్లాస్టిక్ లేదా గాజు పాత్రలపై ఉండే స్టిక్కర్లను తీసేసినప్పుడు గట్టి జిగురు మిగిలిపోతుంది. ఆ ప్రదేశంలో కొద్దిపాటి వేడిని తగిలేలా చేస్తే జిగురు మెత్తబడి సులభంగా ఊడిపోతుంది. అయితే ప్లాస్టిక్, పాలిష్ చేసిన చెక్క వస్తువులపై నేరుగా వేడి తగలకుండా జాగ్రత్త వహించాలి.

చెక్క బల్లలపై నీటి మరకలు పోవడానికి

టీ కప్పులు, తడి గాజు గ్లాసులు చెక్క టేబుల్‌పై ఉంచినప్పుడు ఏర్పడే తెల్లటి గుండ్రని మరకలు ఇబ్బంది పెడుతుంటాయి. ఆ మరకపై పలుచని కాటన్ వస్త్రాన్ని ఉంచి, తక్కువ వేడిలో ఐరన్‌ను కొన్ని సెకన్ల పాటు తిప్పితే తేమ ఆవిరైపోయి బల్లపై పూర్వపు మెరుపు వస్తుంది.

వేలాడుతున్న కర్టెన్ల ఇస్త్రీ

మందపాటి కిటికీ, తలుపుల కర్టెన్లను పదేపదే తీసి, ఇస్త్రీ బోర్డుపై వేసి ఐరన్ చేయడం కష్టంతో కూడుకున్న పని. స్టీమ్ ఫీచర్ ఉన్న ఐరన్ బాక్స్ ద్వారా కర్టెన్లు వేలాడదీసి ఉన్న స్థితిలోనే నిలువుగా స్టీమ్ చేసి ముడతలను పోగొట్టవచ్చు.

కార్పెట్‌పై ఫర్నిచర్ గుంతలు పూడ్చడం

సోఫాలు, బరువైన బల్లలను చాలాకాలం ఒకేచోట ఉంచినప్పుడు కార్పెట్ ఫైబర్లు కుచించుకుపోయి గుంతల్లా ఏర్పడతాయి. ఆ భాగంపై తడి వస్త్రాన్ని ఉంచి, కాస్త స్టీమ్ వేడిని తగిలేలా చేస్తే ఫైబర్లు తిరిగి విచ్చుకుని కార్పెట్ మునుపటిలా మారుతుంది.

బట్టల సమస్యలకు చెక్

బట్టలపై చిన్న రంధ్రాలు పడినా, డిజైన్లు వదులైనా మార్కెట్‌లో లభించే ఐరన్ ఆన్ ప్యాచ్‌‌లను ఉపయోగించవచ్చు. సూది, దారం అవసరం లేకుండా కేవలం వేడి ద్వారానే ఈ ప్యాచ్‌లను బట్టలకు అంటించవచ్చు.

తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు

ఉష్ణోగ్రత నియంత్రణ: ఐరన్ వేడిని ఆయా వస్తువుల స్వభావాన్ని బట్టి మాత్రమే నియంత్రించాలి.

ముందస్తు పరీక్ష: సున్నితమైన దుస్తులు, సింథటిక్ వస్త్రాలు, పాలిష్ చేసిన ఫర్నిచర్‌పై ఐరన్ వాడేముందు ఒక మూలన చిన్న భాగంలో పరీక్షించుకోవడం మంచిది.

డైరెక్ట్ హీట్ వద్దు: మరకలను తొలగించే క్రమంలో ఐరన్‌ను నేరుగా ఉపరితలంపై పెట్టకుండా మధ్యలో కాగితం లేదా పలుచని కాటన్ వస్త్రాన్ని అడ్డుగా ఉంచడం ముఖ్యం.

Follow Us
బట్టల ఇస్త్రీకే కాదు.. ఐరన్ బాక్స్‌తో ఇన్ని పనులు చేయొచ్చా..
బట్టల ఇస్త్రీకే కాదు.. ఐరన్ బాక్స్‌తో ఇన్ని పనులు చేయొచ్చా..
వాస్తు ప్రకారం ఈ మొక్కలకు అంత పవర్ ఉందా?
వాస్తు ప్రకారం ఈ మొక్కలకు అంత పవర్ ఉందా?
జిగురు అస్సలు ఉండదు.. పెరుగుతో బెండకాయ కూర ఇలా చేస్తే అదిరిపోద్ది
జిగురు అస్సలు ఉండదు.. పెరుగుతో బెండకాయ కూర ఇలా చేస్తే అదిరిపోద్ది
శుక్రుడి అనుగ్రహంతో వీరికి ఆర్థికంగా, కెరీర్‌లో పురోగతి..!
శుక్రుడి అనుగ్రహంతో వీరికి ఆర్థికంగా, కెరీర్‌లో పురోగతి..!
తులసి మాల వేసుకుంటే ఈ 2 ఆహారాలకు దూరంగా ఉండాలా?
తులసి మాల వేసుకుంటే ఈ 2 ఆహారాలకు దూరంగా ఉండాలా?
అక్కడ మెడల్ సాధిస్తే ఆ ఫీలింగే వేరు.. దేశం కోసం ఆడతానన్న బిష్ణోయ్
అక్కడ మెడల్ సాధిస్తే ఆ ఫీలింగే వేరు.. దేశం కోసం ఆడతానన్న బిష్ణోయ్
ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్.. 2490 కోట్ల ఆస్తి తగ్గినా కింగే.
ఈ చిన్నోడు పాన్ ఇండియా స్టార్.. 2490 కోట్ల ఆస్తి తగ్గినా కింగే.
శత్రువును ఎదుర్కోవాలంటే.. ఈ 7 వ్యూహాత్మక అస్రాలు మీకు తెలియాలి!
శత్రువును ఎదుర్కోవాలంటే.. ఈ 7 వ్యూహాత్మక అస్రాలు మీకు తెలియాలి!
ట్రాఫిక్ చలాన్లు కట్టట్లేదా? అయితే మీ ఇంట్లో కరెంట్ కట్ అవ్వొచ్చు
ట్రాఫిక్ చలాన్లు కట్టట్లేదా? అయితే మీ ఇంట్లో కరెంట్ కట్ అవ్వొచ్చు
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే.. అతడి అకౌంట్లోని డబ్బులు ఏమవుతాయి..?
బ్యాంక్ ఖాతాదారుడు మరణిస్తే.. అతడి అకౌంట్లోని డబ్బులు ఏమవుతాయి..?