Fitness Tips : పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి వ్యాయామం అవసరం. ఒక వ్యక్తి 50 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత వర్కవుట్ చేయడం చాలా ముఖ్యం. వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలను సరైన ఫిట్‌నెస్‌తో పరిష్కరించుకోవచ్చు. 50 ఏళ్లు పైబడిన వారు ఫిట్‌గా నిపుణలు కొన్ని సూచనలు చేశారు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
వయస్సు మీద పడుతున్న కొద్దీ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక కేలరీలు ఉండే ఆహారం తీసుకోకూడదు. చక్కెర, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. శారీరక శ్రమ చేయడం చాలా ముఖ్యం. గతంలో మీకు వెయిట్‌లిఫ్టింగ్‌లో అనుభవం ఉంటే దానిని కొనసాగిస్తే బాగుంటుంది. అయితే గాయాలు కానీ ఇతర సమస్యలు కానీ ఉంటే బరువులు ఎత్తవద్దు. ఒకరోజు చేసి మరో చేయకుండా ఉండవద్దు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎక్సర్ సైజ్ చేయాలి. అలాగే మీ శరీరంపై కూడా దృష్టి సారించాలి. అలసటగా ఉంటే గ్యాప్ తీసుకొని కొనసాగించాలి.
పెద్దవారయ్యే కొద్దీ మీ జీవక్రియ మందగిస్తుంది. ఎక్కువ తినడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది. తక్కువగా తింటే మంచిది. ఎక్కువ నీరు త్రాగండి, ప్యాక్ చేయని తాజా ఆహారాలు, పండ్లు ఎక్కువగా తినాలి. ప్రొటీన్ ఉండే ఆహారాలు ఆరోగ్యానికి మంచివి. పెద్దయ్యాక శరీరానికి విటమిన్ డి అవసరం. అందుకోసం సూర్యకాంతి పడే విధంగా చూసుకోవాలి నిర్లక్ష్యం చేయవద్దు. రెగ్యులర్ వ్యాయామం చేస్తే 50 సంవత్సరాల తర్వాత కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు. మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాదు ఆస్పత్రి ఖర్చులు, మందుల ఖర్చులు ఆదా అవుతాయి.