Health Tips: రాత్రిపూట ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా..? అయితే, ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

రాత్రి వేళ తగినంత నిద్ర లేకపోతే.. మీ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు పేర్కొంటున్నారు. ధృఢమైన ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం.

Health Tips: రాత్రిపూట ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా..? అయితే, ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Health Tips

Updated on: Sep 06, 2022 | 1:52 PM

Lifestyle Changes For Better Sleep: నేటికాలంలో చాలామంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది రాత్రిపూట నిద్ర లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. నిద్రలేమి, నిద్రపోయినా తరచుగా మేల్కొనడం, నిద్రలో విశ్రాంతి లేకపోవడం, అసంపూర్తిగా నిద్రపోవడం వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అదే సమయంలో.. రాత్రి వేళ తగినంత నిద్ర లేకపోతే.. మీ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు పేర్కొంటున్నారు. ధృఢమైన ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. మీరు రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేకపోతే, రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అయితే నిద్ర పట్టకపోవడానికి మీలోని కొన్ని అలవాట్లు కారణమవుతాయన్న విషయం మీకు తెలుసా.. ? తెలియకపోతే ఈ విషయాలను తెలుసుకోండి.. రాత్రిపూట నిద్రపోకపోతే ముఖ్యంగా మీ జీవితంలో, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మంచి నిద్ర కోసం జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోండి

ఉదయం కొంత సమయం ఎండలో గడపండి: మంచి నిద్ర కోసం ఎండలో కొంత సమయం గడపండి.. ఇలా మీ రోజును నిత్యం ప్రారంభించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మెదడులోని సెరోటోనిన్ స్థాయి పెరిగి శరీరానికి శక్తిని అందిస్తుంది. మీరు కూడా రాత్రి నిద్రపోకపోవడం లాంటి సమస్యతో బాధపడుతుంటే కొంత సమయం ఎండలో గడపండి.

ఇవి కూడా చదవండి

నెయ్యితో పాదాలను మసాజ్ చేయండి: రాత్రి వేళ నిద్రపోట్టకపోతే.. నిద్రపోయే 30 నిమిషాల ముందు మీ పాదాలను గోరువెచ్చని నెయ్యితో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే రాత్రిపూట మంచి నిద్ర కూడా వస్తుంది.

డిన్నర్‌లో ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తినండి: ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో మంచి నిద్రను ప్రోత్సహించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో రాత్రిపూట మీకు మంచి నిద్ర వస్తుంది.

సాయంత్రం తర్వాత టీ-కాఫీ తాగవద్దు: టీ లేదా కాఫీలో కెఫిన్ ఉంటుంది. మీ నిద్రకు భంగం కలిగించేవి వీటిలో ఉంటాయి. దీంతో శరీరానికి అశాంతి కలుగుతుంది. కావున సాయంత్రం తర్వాత టీ లేదా కాఫీ తాగవద్దు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..