AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే.. సాగినికిపైగా ఆదా చేసుకోవచ్చు!

Electricity bill saving tips: సమ్మర్ వచ్చిందంటే చాలూ ప్రతి ఇంట్లో ఫ్యాన్‌లు, ఏసీలు, ప్రిజ్‌లు, కూలర్స్‌ 24 అవర్స్ రన్ అవుతూనే ఉంటాయి. దీంతో నెల తిరిగే సరికి వేలల్లో వచ్చే కరెంటు బిల్‌ చూసి జనాలు షాక్ అవుతూ ఉంటారు. కానీ మేం చెప్పబోయే ఈ సింపుట్ టిప్స్‌ ఫాలో అయితే ఇవన్ని 24గంటలు వాడినా మీ కరెంట్ బిల్ చాలా వరకు తగ్గుతుంది. ఇంకేందు లేట్.. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

సమ్మర్‌లో కరెంట్ బిల్లు వాచిపోతుందా..? ఈ సింపుట్‌ టిప్స్ పాటిస్తే.. సాగినికిపైగా ఆదా చేసుకోవచ్చు!
Electricity Bill Saving Tips
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Apr 07, 2026 | 9:49 AM

Share

వేసవి కాలం మొదలైందంటే చాలు.. భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 దాటితే చాలు ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు విరామం లేకుండా తిరుగుతున్నాయి. అయితే, నెల తిరిగేసరికి వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్లు చూసి సామాన్యుల గుండెలు బాదుకుంటున్నారు. కరెంటు బిల్లును ఎలా తగ్గించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే, చిన్నపాటి జాగ్రత్తలు, స్మార్ట్ టిప్స్ పాటిస్తే మీ విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

సమ్మర్‌లో కరెంట్ బిల్‌ తగ్గించుకునే చిట్కాలు

  • సమ్మర్‌లో చాలామంది గది త్వరగా చల్లబడాలని ఏసీని 16°C లేదా 18°C దగ్గర పెడతారు. దీనివల్ల కంప్రెసర్ పైన భారం పడి కరెంటు ఎక్కువగా కాలుతుంది.ఏసీని ఎప్పుడూ 24°C నుండి 26°C మధ్య ఉంచండి. ఇలా చేయడం వల్ల సుమారు 20 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది.గదిలోని చల్లదనం బయటకు పోకుండా కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉన్నాయో లేదో చూసుకోండి.
  • వేసవిలో ఫ్రిజ్‌ను పదే పదే తీయడం వల్ల లోపల ఉన్న చల్లదనం బయటకు పోయి, మళ్లీ చల్లబడటానికి ఎక్కువ విద్యుత్ అవసరమవుతుంది. ఫ్రిజ్‌ను గోడకు అంటించినట్లు పెట్టకుండా.. వెనుక వైపు కనీసం 6 అంగుళాల గ్యాప్ ఉంచండి. దీనివల్ల వేడి త్వరగా బయటకు వెళ్లిపోతుంది. వేడి వేడి పదార్థాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకండి. అవి పూర్తిగా చల్లారిన తర్వాతే లోపల పెట్టండి.
  • మీ ఇంట్లో ఇంకా పాత ట్యూబ్ లైట్లు, బల్బులు వాడుతున్నారా? అయితే వెంటనే వాటిని మార్చేయండి. సాధారణ బల్బుల కంటే LED బల్బులు 80 శాతం తక్కువ విద్యుత్తును వాడుకుంటాయి. పైగా ఇవి తక్కువ వేడిని విడుదల చేస్తాయి.
  • మనం టీవీని రిమోట్‌తో ఆపేస్తాం కానీ, మెయిన్ స్విచ్ కట్టేయడం మర్చిపోతాం. ఇలా చేయడం వల్ల స్టాండ్‌బై మోడ్ లో కూడా విద్యుత్ వినియోగం జరుగుతుంది. మొబైల్ ఛార్జర్లు, మైక్రోవేవ్ ఓవెన్, టీవీ, కంప్యూటర్ వంటివి వాడనప్పుడు ప్లగ్ పాయింట్ నుంచి తొలగించడం ఉత్తమం.
  • వీలైతే ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోండి. ప్రారంభంలో పెట్టుబడి అనిపించినా, దీర్ఘకాలంలో ఇది మీకు లక్షలాది రూపాయల ఆదాను ఇస్తుంది. ప్రభుత్వం కూడా దీనిపై సబ్సిడీలను అందిస్తోంది.
  • ఎయిర్ కూలర్ వాడేవారు కిటికీ దగ్గర పెట్టుకోవడం వల్ల బయటి గాలిని తీసుకుని గదిని మరింత తాజాగా, చల్లగా ఉంచుతుంది. కూలర్ ప్యాడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల మోటార్‌పై లోడ్ తగ్గుతుంది.
  • ఈ చిన్నపాటి జాగ్రత్తలు మీ కరెంటు బిల్లును తగ్గించడమే కాకుండా, విద్యుత్ ఉపకరణాల జీవితకాలాన్ని కూడా పెంచుతాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజు నుండే ఈ చిట్కాలను పాటించి మీ డబ్బును ఆదా చేసుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్