అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే శ్రమ లేకుండా సన్నబడతారు..!

|

Aug 01, 2024 | 9:24 PM

నిద్రపోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్‌ని సృష్టించి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి బాగా నిద్రపోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే శ్రమ లేకుండా సన్నబడతారు..!
Weight Loss
Follow us on

ఊబకాయం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్య. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. బరువు పెరగడాన్ని నియంత్రించడానికి ప్రజలు జిమ్‌లో గంటల తరబడి శ్రమిస్తున్నారు. డైట్‌ పేరుతో సగం కడుపుకే ఆహారం తీసుకుంటున్నారు. అయితే దీని వల్ల ఉపయోగం లేదు. భోజనం మానేయడం, డైటింగ్ చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు అనుకుంటారు చాలా మంది. కానీ, మనం తీసుకునే ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. మీరు బరువు తగ్గాలనుకుంటే రాత్రి 7 గంటలలోపు తినడం అలవాటు చేసుకోండి.

రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య దాదాపు 3 గంటల గ్యాప్ ఉండాలంటున్నారు నిపుణులు. రాత్రిపూట భోజనం చేయడం వల్ల జీర్ణం సరిగా జరగదు. దీంతో జీవక్రియ ప్రభావితం అవుతుంది. దీని కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే, సాయంత్రం త్వరగా తినడం అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే, రాత్రిపూట ఎల్లప్పుడూ లైట్‌ఫుడ్‌ తీసుకోవటం బెటర్‌ అంటున్నారు.

బరువు తగ్గడానికి డిన్నర్‌లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. రాత్రిపూట మీరు పచ్చి కూరగాయలు, సూప్, సలాడ్, పప్పు తినవచ్చు. మీకు అర్థరాత్రి ఆకలిగా అనిపిస్తే, కీర దోసకాయ లేదంటే యాపిల్‌ వంటి పండ్లను తినొచ్చు. మనం త్వరగా నిద్రపోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరంలో బ్రౌన్ ఫ్యాట్‌ని సృష్టించి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి బాగా నిద్రపోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఊబకాయం అనేది అటు నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. బరువు తగ్గడానికి కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం. మీకు తగినంత నిద్ర లేకపోతే, అది మీ జీవక్రియను నెమ్మదిస్తుంది. దీంతో బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. ఇక మంచి నిద్ర కోసం రాత్రి పుకునే ముందు పసుపు పాలు తాగడం అలవాటు చేసుకోంది. పసుపు పాలు బరువు తగ్గడానికి, మంచి నిద్రకు సహాయపడుతుంది. పసుపులో కొవ్వును కాల్చడానికి సహాయపడే థర్మోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. దీనితో పాటు, ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..