AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karimeen Fry : కొరమీను ఫ్రై ఇలా చేశారంటే.. అందరూ మీకు ఫ్యాన్ అయిపోతారు!

చికెన్, మటన్ కంటే చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరోగ్యానికి మంచి చేసే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. గుండె జబ్బులు, క్యాన్సర్, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు ఇలా రక రకాల ప్రాబ్లమ్స్‌ను అదుపు చేసుకోవచ్చు. చేపల్లో కొరమీనుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ చేప ఎంతో రుచిగా ఉంటుంది. దీంతో ఏం చేసినా చాలా బావుంటుంది. కొరమీను ఫ్రై గురించి ప్రత్యేకంగా..

Karimeen Fry : కొరమీను ఫ్రై ఇలా చేశారంటే.. అందరూ మీకు ఫ్యాన్ అయిపోతారు!
Karimeen Fry
Chinni Enni
|

Updated on: Feb 17, 2024 | 6:45 PM

Share

చికెన్, మటన్ కంటే చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరోగ్యానికి మంచి చేసే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. గుండె జబ్బులు, క్యాన్సర్, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు ఇలా రక రకాల ప్రాబ్లమ్స్‌ను అదుపు చేసుకోవచ్చు. చేపల్లో కొరమీనుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ చేప ఎంతో రుచిగా ఉంటుంది. దీంతో ఏం చేసినా చాలా బావుంటుంది. కొరమీను ఫ్రై గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి ఇలా చేశారంటే.. తిన్న వాళ్లందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు. దీన్ని పిల్లలకు కూడా పెడితే.. ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ కొరమీను ఫ్రై ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం.

కొరమీను ఫ్రైకి‌ కావాల్సిన పదార్థాలు:

కొరమీను చేపలు, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా పొడి, కొద్దిగా పెరుగు, కరివేపాకు, నిమ్మకాయ.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా కొరమీను చేపల్ని పెరుగు, ఉప్పు, పసుపు వేసి నీచు వాసన లేకుండా బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న ముక్కల్నీ.. పక్కకి పెట్టుకోవాలి. ఫ్రైకి ఎప్పుడైనా చేపలను సన్నగా పల్చగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఖాళీగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా పొడి, కరివేపాకు, కొద్దిగా పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. కనీసం ఒక గంట పాటైనా ఉంచి.. ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. దీన్ని డీప్ ఫ్రై కాకుండా.. పెనం మీద షాలో ఫ్రై చేసుకోవచ్చు. రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని.. ఆ తర్వాత నిమ్మ రసం పిండి తింటే.. ఖచ్చితంగా వావ్ అంటారు. ఈ రెసిపీని వీకెండ్స్ లేదా స్పెషల్ డేస్‌లో తయారు చేసుకోవచ్చు. అంతే కాదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Follow Us
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
పేదరికం నుండి ఎయిమ్స్ దాకా: డాక్టర్ రవితేజ స్ఫూర్తిదాయక ప్రయాణం
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..