Masala Green Tea: ఈ సీజన్‌లో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం మసాలా గ్రీన్ టీ బెస్ట్ ఎంపిక.. రెసిపీ మీ కోసం..

|

Jul 26, 2024 | 6:57 PM

వర్షాకాలం, శీతాకాలం వస్తే చాలు వేడి వేడిగా తేనీరుని తాగడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం వలన శరీరం వెచ్చగా ఉంచడమే కాదు జలుబు, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్రీన్ టీని రెగ్యులర్ గా మాత్రమే కాదు, నిమ్మరసం, అల్లం వంటి వాటిని జోడించి రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు శరీరానికి వెచ్చదనంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే మాసాలా గ్రీన్ టీని తయారు చేసుకోవచ్చు. ఈ రోజు మసాలా గ్రీన్ టీ తయారీ రెసిపీ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Masala Green Tea: ఈ సీజన్‌లో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం మసాలా గ్రీన్ టీ బెస్ట్ ఎంపిక.. రెసిపీ మీ కోసం..
Masala Green Tea
Follow us on

పాలతో చేసిన టీ మాత్రమే కాదు మసాలా టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి అనేక రకాల టీలను ఇష్టంగా కొందరు ఆరోగ్య ప్రయోజనాల కోసం కొందరు తాగుతారు. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలం వస్తే చాలు వేడి వేడిగా తేనీరుని తాగడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం వలన శరీరం వెచ్చగా ఉంచడమే కాదు జలుబు, దగ్గు వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నేపధ్యంలో గ్రీన్ టీని రెగ్యులర్ గా మాత్రమే కాదు, నిమ్మరసం, అల్లం వంటి వాటిని జోడించి రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు శరీరానికి వెచ్చదనంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే మాసాలా గ్రీన్ టీని తయారు చేసుకోవచ్చు. ఈ రోజు మసాలా గ్రీన్ టీ తయారీ రెసిపీ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

మ‌సాలా గ్రీన్ టీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

  1. గ్రీన్ టీ ఆకులు- ఒకటిన్నర టీ స్పూన్లు
    లేదా
    గ్రీన్ టీ బ్యాగ్- ఒకటి
  2. దాల్చిన చెక్క – ఒకటి
  3. అల్లం – ఒక టీ స్పూన్ (ముక్కలు)
  4. లవంగాలు – రెండు లేదా మూడు
  5. నిమ్మ గడ్డి – అర టీ స్పూన్
  6. ఆరెంజ్ జ్యూస్ – ఒక టేబుల్ స్పూన్‌
  7. తేనె – రుచికి సరిపడా
  8. నీరు – ఒకటిన్నర కప్పు

త‌యారు చేసే విధానం: ఒక గిన్నె తీసుకుని అందులో అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, నిమ్మ గడ్డి వేసి మరిగించాలి. ఇలా మరిగిన నీటిలో గ్రీన్ టీ ఆకులు లేదా గ్రీన్ టీ బ్యాగ్ వేసి మరిగించాలి. ఇలా మరిగిన నీటిని ఒక కప్పులోకి తీసుకుని అందులో ఆరెంజ్ జ్యూస్ ని లేదా తేనెను కలుపుకుని నులి వెచ్చగా తీసుకోవాలి. ఈ మసాలా గ్రీన్ టీ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

  1. మ‌సాలా గ్రీన్ టీతాగడం వలన శరీరం బరువు అదుపులో ఉంటుంది.
  2. అధికంగా ఉన్న బరువు తగ్గుతుంది.
  3. శ‌రీరంలో మెటబాలిజం పెరుగుతుంది
  4. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది
  5. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి
  6. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది

 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..