కాఫీ తాగడానికే కాదండోయ్.. ఇలా తలస్నానం చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారి పొడుగ్గా పెరుగుతుందట..

జుట్టు బలంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. ఇందుకోసం కాఫీ పౌడర్‌లో కావాల్సినంత కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా కనీసం వారానికి రెండు సార్లు చేయాలి. కాఫీ పౌడర్ తో వారం లో 2 సార్లు ఇలా మాస్క్ వేసుకుంటే జుట్టు నల్లగా మారే అవకాశముంది.

కాఫీ తాగడానికే కాదండోయ్.. ఇలా తలస్నానం చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారి పొడుగ్గా పెరుగుతుందట..
Coffee Powder

Updated on: May 28, 2025 | 12:10 PM

కాఫీ మంచి సౌందర్య సాధనంగా పనిచేస్తుంది. అందాన్ని కాపాడడంలో కాఫీ కీ రోల్ పోషిస్తుంది. కాఫీని వాడడం వల్ల చర్మానికి, జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది. కాఫీ మిశ్రమంతో జుట్టు బలంగా, మెరుస్తూ ఉండేలా చేసుకోవచ్చు.. అదేలాగంటే కాఫీ పౌడర్ తో చేసిన హెయిర్ మాస్క్ కురులకు మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. జుట్టు బలంగా ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. ఇందుకోసం కాఫీ పౌడర్‌లో కావాల్సినంత కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా కనీసం వారానికి రెండు సార్లు చేయాలి. కాఫీ పౌడర్ తో వారం లో 2 సార్లు ఇలా మాస్క్ వేసుకుంటే జుట్టు నల్లగా మారే అవకాశముంది.

జుట్టు సంరక్షణలో కాఫీని వాడేందుకు మరో పద్ధతి కూడా ఉంది. ఇందుకోసం ఒక గిన్నెలో కప్పు పెరుగు, చెంచా కాఫీపొడి, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి.. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పూర్తిగా పట్టించాలి. తలంతట పూర్తిగా అప్లై చేసిన అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చాలు. ఈ ప్యాక్‌తో జుట్టుకు మంచి కండిషనర్‌లా పనిచేసి కేశాలకు మృదువు, మెరుపును తెస్తుంది.

మరోక పద్ధతిలో ఒక స్పూన్ కాఫీ పొడి, మయోనైజ్‌, గ్లిజరిన్‌ తీసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి శిరోజాల చివర్ల వరకు స్మూత్‌గా అప్లై చేసుకోవాలి. సుమారు అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఆరనిచ్చి తక్కువ గాఢత కలిగిన షాంపుతో స్నానం చేస్తే చాలు. కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచి, శిరోజాలు చిట్లకుండా సంరక్షిస్తుంది.

ఇవి కూడా చదవండి

కాఫీ తో మరో పద్ధతిలో కూడా హెయిర్‌ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక స్పూన్ కాఫీ పొడికి రెండు విటమిన్‌ ఈ క్యాప్సుల్స్‌ కలిపి తలంతటా రాసి అరగంట ఆరనివ్వాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో వాష్‌ చేసుకోవాలి. క్రమం తప్పకుండా తరచూ ఇలా చేస్తూ ఉంటే.. కొద్దిరోజుల్లోనే నల్లటి ఒత్తైన జుట్టు మీ సొంతమవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..