
సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలు ఐస్‌క్రీమ్‌ల కోసం ఎగబడుతూ ఉంటారు. అయితే కానీ ప్రస్తుత రోజుల్లో కాసులకు కక్కుర్తి పడి కొందరు వ్యాపారులు పిల్లలు ఇష్టంగా తినే ఆహారాల్లో కల్తీ పదార్థాలను వాడుతున్నారు. కృత్రిమ రంగులు కలిపి జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కాబట్టి ఈ వేసవిలో మీ పిల్లలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, రుచికరమైన ఆహారం ఇవ్వాలనుకుంటే, దుకాణాల్లో కొనే ఐస్ క్రీమ్‌లు వద్దు.. మార్కెట్ తరహాలో చిక్కగా ఉండే మట్కా కుల్ఫీ మీరు ఇంట్లోనే తయారు చేసి మీ పిల్లలకు ఇవ్వండి. ఇది టేస్ట్‌తో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
దీనిని ఇంట్లో తయారుచేసుకునే పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు. సింపుల్‌గా తయారు చేయవచ్చు. ఇంట్లో చేసే కుల్పీకి ఉన్న మరో ప్రత్యేక ఏమిటంటే ఇది పూర్తిగా ఆరోగ్యవంతమైన, ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది. దీన్ని తినేందుకు పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడుతారు. కాబట్టి దీన్ని తయారు చేసేందుకు ఎలాంటి పదార్థాలు కావాలి.. ఇంట్లో సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూద్దాం.
మట్కా కుల్ఫీకి కావలసిన పదార్థాలు
మట్కా కుల్ఫీ తయారు చేసే విధానం
ముందుగా ఓప పెద్దగిన్నె తీసుకొని అందులో పాలు పోసి మరిగించండి. తర్వాత మంటను మీడియం ప్లేమ్‌లో పెట్టి పాలపై మీగడ వచ్చేంత వరకు మరిగించండి. ఇప్పుడు గిన్నె అంచులకు అంటుకున్న మీగడను తీసి, దానిని పాలలో పదేపదే కలుపుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల మెత్తని, క్రీములాంటి కుల్ఫీ తయారవుతుంది. ఇప్పుడు పాలు సగానికి తగ్గినప్పుడు, పాలపొడి, చక్కెర వేసి బాగా కలపండి. తర్వాత 5 నిమిషాలు ఉడికించండి.
ఇప్పుడు చిక్కబడిన పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు, యాలకుల పొడి, సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను కలపండి. అన్నింటినీ కలిపి తిప్పి, 2 నిమిషాలు మరిగించి, ఆ తర్వాత మంటను ఆపివేయండి. ఇలా తయారుచేసుకున్న క్రీమీ కుల్ఫీ మిశ్రమాన్ని గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత, మిశ్రమాన్ని చిన్న మట్టి కుండలలో పోయండి. కొన్ని తరిగిన పిస్తా, బాదంపప్పులతో అలంకరించండి.
తర్వాత ఆ మట్టి కుండల మూతలకు అల్యూమీనియం పాయిల్‌తో గట్టి మూసేయండి. తర్వాత వాటిని డీ ఫ్రీజ్‌లో కనీసం 7 నుండి 8 గంటల పాటు లేదా రాత్రంతా గడ్డకట్టించండి. తర్వాత బయటకు తీస్తే మీ చల్లని, సువాసనగల, క్రీమీ మార్కెట్ స్టైల్ మట్కా కుల్ఫీ రెడీ అయినట్టే దీనిని మధ్యహ్నం సమయంలో తింటే శరీరానికి ఎంతో చల్లగా ఉంటుంది.
Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం మేరకు అందించబడింది. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.