AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్.. మ్యాజిక్ డ్రింక్.. పడుకునేముందు తాగితే కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే.. రాత్రికి రాత్రే..

Weight loss tips: బరువు తగ్గడం అంటే ఇక కష్టం కాదు.. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరాన్ని ఫ్యాట్ బర్నింగ్ మెషీన్‌లా మార్చే అద్భుత డ్రింక్ గురించి మీకు తెలుసా..? మన వంటింట్లో ఉండే సహజ పదార్థాలతో రాత్రిపూట ఒక హెల్తీ డ్రింక్ తీసుకుంటే.. బొడ్డు కొవ్వు మాయమవ్వడమే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. దానిని ఎలా తయారుచేసుకోవాలంటే..?

వావ్.. మ్యాజిక్ డ్రింక్.. పడుకునేముందు తాగితే కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే.. రాత్రికి రాత్రే..
How To Lose Weight While You Sleep
Krishna S
|

Updated on: Feb 04, 2026 | 12:36 PM

Share

ఈ ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల నేడు చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య బెల్లీ ఫ్యాట్. జిమ్‌లో గంటల తరబడి కష్టపడినా, కఠినమైన డైటింగ్ చేసినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం ఉండదు. అయితే ఆయుర్వేదం ప్రకారం.. మన వంటింట్లో ఉండే కొన్ని అద్భుతమైన పదార్థాలతో రాత్రిపూట కూడా కొవ్వును కరిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో జీవక్రియను వేగవంతం చేసే సహజ పానీయాలు తీసుకుంటే, శరీరం అంతర్గతంగా శుభ్రపడటమే కాకుండా.. కొవ్వు కరిగించే ప్రక్రియ రాత్రంతా నిరంతరాయంగా కొనసాగుతుంది.

మ్యాజికల్ డ్రింక్ తయారీకి కావలసినవి

  • ఈ పానీయంలో ఉపయోగించే ప్రతి పదార్థం ఒక ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది.
  • అల్లం శరీర ఉష్ణోగ్రతను స్వల్పంగా పెంచి కేలరీలను ఖర్చు చేస్తుంది.
  • నిమ్మకాయ శరీరంలోని విషతుల్యాలను తొలగించి, మెటబాలిజాన్ని పెంచుతుంది.
  • జీలకర్ర, ధనియాల పొడి.. కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి, రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

తయారీ విధానం – చాలా సులభం

  • ఒక పెద్ద గ్లాసు నీటిని తీసుకుని మరిగించండి.
  • అందులో కొద్దిగా తురిమిన అల్లం, అర టీస్పూన్ జీలకర్ర లేదా ధనియాల పొడి వేయండి.
  • కనీసం 5 నిమిషాల పాటు మరిగించి ఆపై వడకట్టండి.
  • నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో సగం నిమ్మకాయ రసం కలపండి.

ఎలా తీసుకోవాలి?

ఈ డ్రింక్‌ను రాత్రి పడుకోవడానికి 30 నుండి 40 నిమిషాల ముందు తాగాలి. తాగిన తర్వాత మళ్లీ ఏమీ తినకూడదు. ఈ డ్రింక్ వల్ల నిద్రలో మందగించే జీర్ణ వ్యవస్థను ఇది చురుగ్గా ఉంచుతుంది. ఉదయాన్నే కడుపు సాఫీగా అయ్యేలా చేసి, తేలికగా అనిపించేలా చేస్తుంది. జీలకర్ర ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయడం వల్ల కొత్తగా కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది.

(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు లేదా పాటించే ముందు వైద్యులను సంప్రదించండి)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us