AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైసా ఖర్చు లేకుండా నల్లటి గ్యాస్ స్టవ్ బర్నర్‌లను కొత్తవాటిలా మెరిపించండి.. ఎవ్వరు చెప్పని ట్రిక్స్ ఇవే..

వంటగదిలో ప్రతిరోజూ మహిళలను వేధించే అతిపెద్ద సమస్యల్లో గ్యాస్ స్టవ్ బర్నర్లు నల్లగా మారడం ఒకటి. చాయ్, పాలు పొంగిపోవడం లేదా నూనె జిడ్డు వల్ల బర్నర్ రంధ్రాలు మూసుకుపోయి మంట చాలా తక్కువగా వస్తుంటుంది. అయితే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వస్తువులతో కేవలం 20 నిమిషాల్లో ఈ బర్నర్లను కొత్తవాటిలా మెరిపించే అద్భుతమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..

పైసా ఖర్చు లేకుండా నల్లటి గ్యాస్ స్టవ్ బర్నర్‌లను కొత్తవాటిలా మెరిపించండి.. ఎవ్వరు చెప్పని ట్రిక్స్ ఇవే..
How To Clean Gas Burners At Home
Krishna S
|

Updated on: Jul 19, 2026 | 4:10 PM

Share

వంటగదిలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు గ్యాస్ స్టవ్‌తోనే ఎక్కువ పని ఉంటుంది. రోజంతా ఏదో ఒక వంట చేస్తూనే ఉంటాం. అయితే పాలు లేదా చాయ్ పొంగిపోవడం, కూరల జిడ్డు, నూనె మరకలు పడటం వల్ల గ్యాస్ బర్నర్లు మెల్లమెల్లగా నల్లగా మారిపోతాయి. ఈ గలీజంతా బర్నర్ రంధ్రాలలో పేరుకుపోవడం వల్ల గ్యాస్ సరిగ్గా రాక మంట చాలా తక్కువగా వస్తుంది. దీనివల్ల వంట ఆలస్యం అవ్వడమే కాకుండా గ్యాస్ కూడా వృథా అవుతుంది. ఒకవేళ మీ ఇంట్లో కూడా గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయి ఉంటే.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే కొన్ని వస్తువులతో వాటిని ముత్యంలా మెరిపించవచ్చు.

అసలు గ్యాస్ బర్నర్లు ఎందుకు నల్లగా మారుతాయి?

గ్యాస్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల నూనె జిడ్డు, మాడిపోయిన ఆహార పదార్థాల కణాలు బర్నర్ ఉపరితలంపై, దాని రంధ్రాలలో పేరుకుపోతాయి. ఇది గ్యాస్ సరఫరాను అడ్డుకుంటుంది. ఫలితంగా మంట బలహీనంగా మారుతుంది. గ్యాస్ స్టవ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.

బర్నర్లను ఇలా క్లీన్ చేయండి

స్టెప్ 1: ముందుగా గ్యాస్ స్టవ్ నుండి బర్నర్లను విడిగా తీసుకోండి. ఒక గిన్నెలో బాగా వేడిగా ఉన్న నీటిని తీసుకోవాలి. అందులో 1 ప్యాకెట్ ఈనో, 1 స్పూన్ బేకింగ్ సోడా, 2 నుండి 3 స్పూన్ల వెనిగర్ కలపాలి.

స్టెప్ 2: ఈ మిశ్రమంలో నల్లగా మారిన బర్నర్లను వేసి 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే నాననివ్వాలి. ఈనో, బేకింగ్ సోడా, వెనిగర్‌ల కలయిక వల్ల బర్నర్‌కు పట్టిన మొండి జిడ్డు, నలుపుదనం చాలా సులభంగా వదిలిపోతాయి.

స్టెప్ 3: బాగా నానిన తర్వాత ఒక పాత టూత్ బ్రష్ తీసుకుని బర్నర్‌ను అన్ని వైపులా బాగా రుద్దాలి. ముఖ్యంగా బర్నర్ రంధ్రాలు, అంచుల వద్ద పేరుకుపోయిన మురికిని గట్టిగా రుద్ది క్లీన్ చేయాలి. రంధ్రాలు ఏవైనా మూసుకుపోయి ఉంటే ఒక టూత్‌పిక్ లేదా పిన్ను సహాయంతో వాటిని క్లియర్ చేయవచ్చు.

స్టెప్ 4: బ్రష్‌తో రుద్దిన తర్వాత బర్నర్లను మంచి నీటితో శుభ్రంగా కడగాలి. ఆపై ఒక పొడి గుడ్డతో తుడిచి, కాసేపు ఎండలో లేదా ఫ్యాన్ కింద పూర్తిగా ఆరబెట్టాలి. బర్నర్లు తడి లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాతే వాటిని తిరిగి గ్యాస్ స్టవ్‌కు అమర్చాలి.

దీనివల్ల కలిగే ప్రయోజనాలు

బర్నర్లు క్లీన్ అవ్వడం వల్ల గ్యాస్ ఫ్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతుంది. దీనివల్ల మంట బ్లూ కలర్‌లో, చాలా వేగంగా, సమానంగా వస్తుంది. ఫలితంగా వంట చాలా త్వరగా పూర్తవుతుంది. గ్యాస్ సిలిండర్ కూడా వృథా కాకుండా ఎక్కువ రోజులు వస్తుంది. వారానికి ఒక్కసారి ఈ చిన్న చిట్కాను పాటిస్తే మీ గ్యాస్ బర్నర్లు ఎల్లప్పుడూ కొత్తవాటిలా మెరుస్తూనే ఉంటాయి.

Follow Us