
Side Effects Of Milk: పాలు.. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి పరిపూర్ణ ఆహారంలో భాగమే..ప్రతి రోజూ రెండు గ్లాసుల పాలు తాగడం వల్ల రెట్టింపు ఆరోగ్యప్రయోజనాలు అందుతాయి. ఒక గ్లాసు పాలలో పూర్తి భోజనంలో ఉన్నన్ని పోషకాలు ఉంటాయి. పాలలో తొమ్మిది రకాల ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలు తాగడంతో ఆరోగ్యం, అందం రెట్టింపు అవుతాయంటున్నారు. పాలలో విటమిన్ ఏ, కాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాల్షియం ఎముకలను ధృడంగా మార్చడమే కాకుండా గుండె, రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పాలు ఎక్కువగా తాగడంతో ప్రమాద సమయాల్లో రక్తస్రావం జరిగినప్పుడు రక్తం తర్వగా గడ్డకట్టేందుకు తోడ్పడుతుంది.
అంతేకాదు.. పాలు తాగడం వల్ల బరువును కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ప్రతి రోజూ పాలు తాగడం వల్ల ఊబకాయం నుంచి దూరంగా ఉండవచ్చు. అలాగే, ఎక్కువ అసిడిటీ ఉన్న పదార్థాలు తినడం వలన అన్నవాహికలో మంట ఏర్పడుతుంది. ఇటువంటి సమయంలో పాలు తాగడం ఉత్తమం. పాలు కూలింగ్ ఏజెంట్‌లా పని చేస్తాయి. పాలు తాగడంతో దంత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మెరిసే చర్మాన్ని అందించడంలో పాలు మనకు సహకరిస్తాయి. పాలు తాగడంతో చర్మం నిత్యం హైడ్రేడ్‌గా ఉంటూ మెరుస్తుంది. దీంతో మీకు యవ్వన గ్లో లభిస్తుంది. పాలలో ఉండే ఎక్కువ విటమిన్లు, మినరల్స్ మిమ్మల్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా పాలలో ఉండే లాక్టోస్ మీ కాలేయంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, కొన్ని రకాల క్యాన్సర్లను మిమ్మల్ని రక్షిస్తుంది.
పాలలో ఉండే విటమిన్ డి శరీరంలో సెరోటోనిన్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మానసిక స్థితి, ఆకలి, నిద్రను కంట్రోల్ చేస్తుంది. డిప్రెషన్‌లో ఉన్న వారికి విటమిన్ డి లోపం ఉంటుంది. వారు పాలను తాగడంతో డిప్రెసన్ నుంచి బయిటపడే అవకాశం ఉంది. పాలు చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా జుట్టును కూడా సంరక్షిస్తాయి. ముఖ్యంగా జుట్టురాలే సమస్యతో బాధపడుతున్న వారు పాలు తాగడంతో మంచి లాభాలు పొందవచ్చు. హెయిర్ మాస్క్ తయారు చేసేందుకు సైతం పాలు ఉపయోగపడతాయి.
కానీ, పాలతో కొందరికీ కొన్ని సైడ్‌ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. జలుబు, దగ్గు, అజీర్ణం, విరేచనాలు, చర్మవ్యాధులు వంటి వ్యాధులతో బాధపడే వారు పాలు అస్సలు తాగకూడదు . అంతే కాకుండా, పాలకు అలెర్జీ ఉన్నవారికి పాలు తాగడం కూడా హానికరం. సాధారణంగా, ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ 750ML (3 కప్పులు) పాలు తాగాలి. పిల్లలు 2.5 కప్పుల పాలు తాగాలి. వ్యక్తి శారీరక అవసరాలకు అనుగుణంగా ఈ పరిమాణం పెరగడం లేదా తగ్గడం గమనార్హం.
ఒక పరిశోధన ప్రకారం, 3 కప్పుల కంటే ఎక్కువ పాలు తాగడం వల్ల తుంటి పగుళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు, మరణాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల, మీరు ఎక్కువ పాలు తాగితే, మీ ఎముకలు బలంగా ఉంటాయి అనే ఈ అపోహను నమ్మవద్దు.
ఫెర్రిటిన్ ఐరన్ లోపం: ఇది కాకుండా, పిల్లలకు ఎక్కువ పాలు తాగించడం వల్ల వారి కడుపు నిండిపోతుంది. అటువంటి పరిస్థితిలో పిల్లవాడి ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ తరువాత ఆహారం తినడానికి ఆసక్తి చూపడు. అదే సమయంలో పాలు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఐరన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఫెర్రిటిన్ అనే ఐరన్. ఫెర్రిటిన్ ఇనుము లోపం రక్తహీనత అవకాశాలను పెంచుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..