Earbuds: ఇయర్‌బర్డ్స్, హెడ్‌ఫోన్స్‌ ఎక్కువగా వాడుతారా? అయితే.. మీకే ఈ వార్నింగ్ !

ఇయర్‌ బడ్స్‌, ఇయర్‌ ఫోన్స్‌ వాడేవారు తక్కువ శబ్దంలోనే ఉపయోగించండి. ఇయర్‌బడ్స్‌కి బదులుగా ఓవర్ ది ఇయర్ హెడ్‌ఫోన్స్ వాడటం మంచిది. చెవిపై పెట్టుకునే హెడ్‌ఫోన్స్ వల్ల ధ్వని చెవిలోకి నేరుగా వెళ్ళదు. కాబట్టి తక్కువ హాని కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ఇయర్‌బడ్స్‌ను వాడిన తరువాత ఎప్పటి కప్పుడు శుభ్రం చేయటం తప్పనిసరి. లేదంటే, దుమ్ము పడితే చెవి ఇన్‌ఫెక్షన్లు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.

Earbuds: ఇయర్‌బర్డ్స్, హెడ్‌ఫోన్స్‌ ఎక్కువగా వాడుతారా? అయితే.. మీకే ఈ వార్నింగ్ !
Earbuds

Updated on: Jul 06, 2025 | 4:57 PM

ఇటీవల ఓ ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇయర్‌బడ్స్ వల్ల 45శాతం వినికిడి శక్తి కోల్పోయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ కాస్త వైరల్‌గా మారటంతో ఇయర్‌బడ్స్ వల్ల నిజంగానే చెవుడు వస్తుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. 85 dB కంటే ఎక్కువ శబ్దం చెవులకు హానికరం అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. తీవ్రమైన శబ్దాలు వినడం వల్ల చెవుల్లోని కణాలు దెబ్బతిని వినికిడి శక్తిని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. వాల్యూమ్‌ను మీడియం స్థాయి కన్నా మించకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. అందుకోసం ముందుగానే మీ వాల్యూమ్‌ను మీడియం స్థాయిలో సరి చేసి పెట్టుకోవాలి.

ఇయర్‌బడ్స్ వల్ల శబ్ద తీవ్రత నేరుగా చెవి పొర, లోపలి చెవిపై పడుతుంది. అటువంటప్పుడు ఆ తీవ్రత చెవుల లోపలి భాగాలకు చాలా హానికరం. భారీ శబ్దాల వల్ల చెవి లోపల కణాలు కాలక్రమేణా దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్‌బడ్స్ వల్ల వినికిడి శక్తి ఒకటి లేదా రెండు రోజుల్లో కాదు, దీర్ఘకాలికంగా వాడితే ప్రభావితం అవుతుంది. మీరు కూడా ఎక్కువ శబ్దంతో ఇయర్‌బడ్స్ వాడుతుంటే జాగ్రత్త. గంటల కొద్దీ ఇయర్‌ఫోన్స్‌ను వాడితే చెవులే కాదు, పరికరమూ దెబ్బతింటుంది.

ఇయర్‌బడ్స్ వాడక తప్పనిసరి అయితే, ఎక్కువసేపు వాడకుండా విరామం తీసుకుంటూ వాడండి. ఇయర్‌ బడ్స్‌, ఇయర్‌ ఫోన్స్‌ వాడేవారు తక్కువ శబ్దంలోనే ఉపయోగించండి. ఇయర్‌బడ్స్‌కి బదులుగా ఓవర్ ది ఇయర్ హెడ్‌ఫోన్స్ వాడటం మంచిది. చెవిపై పెట్టుకునే హెడ్‌ఫోన్స్ వల్ల ధ్వని చెవిలోకి నేరుగా వెళ్ళదు. కాబట్టి తక్కువ హాని కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ఇయర్‌బడ్స్‌ను వాడిన తరువాత ఎప్పటి కప్పుడు శుభ్రం చేయటం తప్పనిసరి. లేదంటే, దుమ్ము పడితే చెవి ఇన్‌ఫెక్షన్లు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..