మనసులో దాచుకుంటే బంధం బలహీనమైపోతుంది.. ఏమున్న మీ భాగస్వామికి చెప్పండి

బంధం అనేది పరస్పర నమ్మకం, మమకారం, భావోద్వేగ భాగస్వామ్యం మీద ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మన భాగస్వామి మనతో పూర్తిగా కలసి మాట్లాడటానికి ఇష్టపడటం మానేస్తారు. దీనికి కారణాలు అనేకం ఉండవచ్చు. మనతో మాట్లాడకుండా ఉండటం వాళ్ల మనసులోని బలహీనతల కారణంగా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సైకాలజీ ప్రకారం భాగస్వామి మనసు విప్పి మాట్లాడకపోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

మనసులో దాచుకుంటే బంధం బలహీనమైపోతుంది.. ఏమున్న మీ భాగస్వామికి చెప్పండి
Relationship Issues

Updated on: Apr 23, 2025 | 9:22 AM

కొంతమందికి తమ మనసులోని భావాలు బయటపెట్టడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కొందరికి భావోద్వేగాలను వ్యక్తపరచడం కష్టం అనిపిస్తుంది. అలాంటి సమయంలో వాళ్లకు ఎవరూ సరైన ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వకపోతే ఆ లోటు వాళ్లను అంతర్గతంగా ఒంటరిగా అనిపించేలా చేస్తుంది. ఈ కారణంగా వారు మనతో మాట్లాడటానికి సాహసించకపోవచ్చు. వారిలో ఓ మౌనం అలవాటు అయిపోయినట్లుగా అవుతుంది.

ఒక సంబంధంలో విశ్వాసం అనేది బలమైన మూలం. కానీ ఏదైనా చిన్న సంఘటన వారిలో అనుమానాన్ని కలిగిస్తే అది పూర్తిగా నమ్మకాన్ని దెబ్బతీయవచ్చు. ఒక్కసారి విశ్వాసం పోయిన తర్వాత వారు మనతో వారి భావాలను పంచుకోవడాన్ని మానేస్తారు. ఇది సంబంధాన్ని దూరం చేసే ప్రమాదం కలిగిస్తుంది.

తమ అభిప్రాయాలు ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారనే భయం కొంత మందిలో ఉంటుంది. ప్రత్యక్షంగా నిర్ణయాలు తీసుకోవడం లేదా విమర్శిస్తారనే భావన వారిని మౌనంగా మారుస్తుంది. ఇది వారిని తట్టుకోలేని ఒత్తిడికి గురిచేస్తుంది.

ఎవరికైనా ఒక బంధం శాంతియుతంగా ఉండాలి. కానీ అదే బంధం ఒత్తిడిగా అనిపించుకుంటే వారు దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అప్పటి నుంచి వారు తమ సమస్యలు పంచుకోవడం మానేస్తారు.

గతంలో ఎదురైన చేదు అనుభవాలు కూడా వారిని మనసు విప్పకుండా చేయవచ్చు. మానసికంగా గాయపడిన వారు మళ్లీ అలాగే బాధపడకుండా ఉండేందుకు ఎవరికీ తమ మనసులోని మాటలు చెప్పే పరిస్థితిని అధిగమించరు.

ఒక వ్యక్తి మాటల తీరులో తేడా కనిపించడం, మునుపటిలా మాట్లాడకపోవడం వల్ల వారు మారిపోయినట్లుగా అనిపించవచ్చు. ఇది కూడా వారు తమ మనసులోని భావాలను బయటపెట్టకపోవడానికి ఒక సంకేతంగా భావించవచ్చు

తమ మాటలు వేరేలా అర్థమై గొడవకు దారి తీస్తాయన్న భయం ఉన్నవారు ముందుగానే తమ మాటలను ఆపుకుంటారు. ఈ భయంతో వాళ్లు ముఖ్యమైన విషయాలను కూడా దాచేస్తారు.

తాము ఏమన్నా చెప్పినా తమ గౌరవాన్ని ఎవరు కించపరచకూడదనే ఆలోచన వాళ్లలో ఉంటే వారు ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోవడానికి వెనుకాడుతారు. ఈ గౌరవభావన వారిని మౌనంగా ఉంచుతుంది.

ఎదుటివాడు తన భావాలను అర్థం చేసుకోలేడు అనే అనుభూతి కలిగితే వారు ఇక తమ మనసులోని విషయాలను పంచుకోవాలనే ఆసక్తి కోల్పోతారు. ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల సంబంధం బలహీనమవుతుంది.

ఈ విధంగా ఈ సంకేతాలను గమనించి భాగస్వామిని అవగాహనతో అర్థం చేసుకోవడం.. సహనంతో ప్రవర్తించడం అనేది బంధాన్ని మరింత బలంగా మార్చే దిశగా తోడ్పడుతుంది.