Hot Water: వేడి నీళ్ల స్నానంతో డిప్రెషన్ దూరం..? నిజమేనా నిపుణులు ఏమంటున్నారు?

వేడి నీటి స్నానం.. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఇది నిజమే. తరచూ వేడి నీటితో స్నానం చేస్తే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

Hot Water: వేడి నీళ్ల స్నానంతో డిప్రెషన్ దూరం..? నిజమేనా నిపుణులు ఏమంటున్నారు?
Bath In Winter
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 19, 2022 | 2:57 PM

డిప్రెషన్..ఈ సమస్యతో బాధపడేవారు ఏ సమయంలో ఏం చేస్తారో? వారికే తెలియదు. మానసిక పరిస్థితిని కంట్రోల్ లో ఉంచుకోవడానికి ఏం చేయాలో? కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ వారి పరిస్థితిని చూసి సొంతవాళ్లు మాత్రం అల్లాడిపోతారు. అయితే అలాంటి వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి కూడా కొన్ని కొన్ని ఉపాయాలు ఉన్నాయి. అదే వేడి నీటి స్నానం.. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఇది నిజమే. తరచూ వేడి నీటితో స్నానం చేస్తే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్టోగ్రత పెరుగుతుంది. అలాగే మెదడుతో సహా ప్రతి అవయవాలు యాక్టివేట్ అవుతాయి. వేడి నీటి స్నానం వల్ల సిర్కాడియన్ లయలు బలపడతాయి. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. డిప్రెషన్ సమస్యతో బాధపడే వారికి సిర్కాడియన్ లయలు తక్కువుగా ఉండడంతో పడుకోవడంలో కూడా ఇబ్బంది పడతారు. సో..వారు తరచూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల మంచి అనుభూతిని పొందుతారు. డిప్రెషన్ రోగులకు ఇదో రకమైన థెరపీ లాంటిదని మానసిక వైద్యుల అభిప్రాయం. 

వేడి నీటితో స్నానం చేయడం వల్ల మెదడులో కొన్ని రసాయనిక మార్పులకు దారి తీస్తుందని కొన్ని నివేదకల్లో నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లలో తగ్గుదల కనిపిస్తుందని పేర్కొన్నారు. వేడి నీటి స్నానం వల్ల  న్యూరో ట్రాన్స్ మిటర్, సెరిటోనిన్ సమతుల్యతకు సాయం చేస్తుంది. అలాగే కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే వేడి నీటి స్నానం వల్ల నిద్ర సంబంధిత రుగ్మతలను కూడా తగ్గించుకోవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..