Drinking Water before bed: నిద్ర మధ్యలో నీరు తాగే అలవాటు ఉందా? ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Anil kumar poka

Updated on: Dec 19, 2022 | 11:59 AM

నీరు తాగడం శరీరానికి మంచిదే అయినా నిద్ర మధ్యలో లేచి నీరు తాగడం శరీరానికి హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Drinking Water before bed: నిద్ర మధ్యలో నీరు తాగే అలవాటు ఉందా? ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు
Drinking Water

నిద్రకు, నీటికి చాలా అవినాభావ సంబంధం ఉంది. మనలో చాలా మందికి నిద్ర మధ్యలో లేచి నీరు తాగి మళ్లీ పడుకునే అలవాటు ఉండి ఉంటుంది. మరొకొంతమందికి బెడ్ పక్కనే మంచినీరు పెట్టుకుని పడుకోవడం అలవాటు. నీరు తాగడం శరీరానికి మంచిదే అయినా నిద్ర మధ్యలో లేచి నీరు తాగడం శరీరానికి హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పడుకునే ముందు నీరు తాగినా, నిద్ర మధ్యలో నీరు తాగినా అది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుందని కొందరి నిపుణుల వాదన.

డీ హైడ్రేషన్ కు గురి కాకుండా కొంత మొత్తంలో నీరు తాగితే పర్లేదు మరీ ఎక్కువ తాగితే రాత్రి సమాయాల్లో నోక్టూరియా వస్తుందని, కచ్చితంగా బాత్రూమ్ కు వెళ్లాల్సి వస్తుందని అది నిద్రకు భంగం కలిస్తుందని పేర్కొంటున్నారు. కాబట్టి పడుకునే మూడు గంటల ముందు మంచి నీరు తాగడం సేఫ్ అని నిపుణుల అభిప్రాయం. పడుకునే ముందు నీరు తాగడం వల్ల నిద్రకు చాలా ఉపయోగకరమైన మెలటనిన్ ఉత్పత్తి పడిపోతుందని దీని వల్ల నిద్రకు భంగం కలుగుతుందని పేర్కొంటున్నారు. అలాగే జీర్ణక్రియకు నష్టం చేకూర్చి, గ్యాస్ సంబంధిత సమస్యలకు కారణమవచ్చని వివరిస్తున్నారు. అంతేకాదు ఈ అలవాటు గురుక వంటి దుష్ప్రభావాలకు సంకేతంగా నిలుస్తుందని చెబుతున్నారు. నిద్రలో డీహైడ్రేషన్ కు గురికాకుండా కాబట్టి రోజంతా నీరు తాగాలని, నిద్రకు ముందో, నిద్ర మధ్యలో తాగకూడదని సూచిస్తున్నారు. రాత్రి సమయంలో దాహం ఎక్కువ వేస్తుందని భావిస్తే వైద్యులను సంప్రదించడం మేలంటున్నారు. 

తాగునీరు ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిది. కానీ సాయంత్రం సమయంలో నీటి పరిమితంగా తాగడం మంచిది. అయితే రోజంతా నీరు తాగడం వల్ల బీపీను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అలాగే ఒత్తిడి హార్మోన్లు నియంత్రించడం, కీళ్లను లూబ్రికెంట్ చేయవచ్చు. అలాగే చర్మ సంబంధిత సమస్యల నుంచి బయట పడవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu