పండుగలు మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మన దేశంలో అతి పెద్ద పండుగలలో హోలీ కూడా ఒకటి. చలికాలం తర్వాత వసంతాన్ని స్వాగతించడానికి దీనిని జరుపుకొంటారు. అన్ని వయసుల వారు ఈ పండుగలో పాలు పంచుకుంటారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొంటూ ఉత్సాహంగా గడుపుతారు. అప్పటి వరకూ ఉన్న చింతలు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ పరమైన టెన్షన్లు, ఒత్తిళ్లను కాస్త పక్కన పెట్టి అంతా జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఇదే తరహా వాతావరణం మనిషి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. రంగుల సంబరాన్ని తెచ్చే హోలీ.. శరీంలో సంతోషకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసి, మనసుకు నెమ్మదిని, ఆరోగ్యాన్ని ఇస్తుందని, మెదడుపై సానూకూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సంతోష హార్మోన్లు.. హోలీని సంతోషకరమైన సందర్భంగా మార్చేది ఏమిటో మీకు తెలుసా? రంగులతో ఆడుకోవడం, స్వీట్లు తినడం, కలిసి రుచికరమైన భోజనం తినడం వల్ల హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి.
మానసిక స్థితి మెరుగువుతుంది.. హోలీ సమయంలో మీ మానసిక స్థితి సరిగ్గా లేకపోయినా, మొత్తం పర్యావరణం మిమ్మల్ని ఉత్తేజపరిచేదిగా ఉంటుంది. మీరు ఆ స్థితి నుంచి బయటకు రాకపోతున్నా.. బయట ఉన్న స్నేహితులో, లేక బంధువులో బలవంతంగా నైనా మీపై రంగులు చిమ్ముతుంటారు. ఈ పరిస్థితి తప్పనిసరై మీరు వారిలో కలిసిపోతారు. అలాంటప్పుడు మీలోని బాధ, ఒత్తిడి వంటివి తొలగిపోతాయి.
ఒత్తిడి తగ్గుతుంది.. హోలీ వేడుకల్లో పాల్గొనడం వల్ల మీ ఒత్తిడి, ఆందోళన స్థాయిలు చాలా వరకు తగ్గిపోతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే వాతావరణం వల్ల మీ సమస్యలన్నీ కాసేపు మరచిపోయి మీరు ఆనందంగా ఉండేందుకు దోహదపడతాయి. మీ ప్రియమైనవారిని కలవడం, కొత్త స్నేహితులను సంపాదించడం, సంగీతానికి డ్యాన్స్ చేయడం ఆందోళనను తగ్గించడడంతో పాటు మీ మానసిక స్థితిని పెంచడానికి సహాయపడుతుంది.
బంధాల మధ్య సమస్యలు తొలగుతాయి.. కొత్తగా పెళ్లైన కపుల్స్ లేదా ఇతర దంపతులు ఇప్పటివరకు ఏదైనా మానసిక సమస్యలను ఎదుర్కొంటు ఉంటే.. హోలీ రంగుల వేడుకల్లో పాల్గొనడం వల్ల మీ మానసిక స్థితి కచ్చితంగా మెరుగుపడుతుంది. సంతోషకరమైన వాతావరణం,ఆహ్లాదకరమైన కార్యకలాపాలు మీరు ఎంతో సంతోషంగా ఉండేందుకు సహాయపడతాయి.
అందరూ ఒక్కచోట చేరతారు.. హోలీ అంటే మీ స్నేహితులు, బంధువులు మీ ఇంటికి వచ్చి రంగులతో ఆడుకునే రోజు. ఇది పరస్పర చర్యకు అవకాశాన్ని సృష్టిస్తుంది. సాధారణంగా, ఇరుగుపొరుగు వారు కూడా వస్తారు. ఇవన్నీ సంభాషణలను ప్రేరేపిస్తాయి, ఇది ఒకరినొకరు బాగా తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఈ సందర్భం పిల్లలు వారి సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.
బంధాలకు బలం.. చిన్నా, పెద్దా, స్త్రీ, పురుషుల లాంటి ఎలాంటి తేడాలు లేకుండా ఆడే హోలీ ఆటలో పాల్గొనడం వల్ల మీ బంధం బలంగా మారేందుకు సహాయపడుతుంది. ప్రతి ఒక్కరూ కలిసి పని చేస్తున్నప్పుడు మీ బంధం మరింత బలంగా మారేందుకు సహాయపడుతుంది.
జీవితానికి కొత్త రంగులు.. హోలీ సమయంలో ఉపయోగించే శక్తివంతమైన రంగులు మన మనస్సులు, మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ లోకంలో ఎన్నో రంగులు మన చట్టూ ఎల్లప్పుడూ ఉంటాయి. అవి మనపై లోతైన మానసిక, శారీరక, భావోద్వేగ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు రెడ్ కలర్ ఎక్కువ స్థిరత్వాన్ని తెస్తుంది. బ్లూ కలర్ వ్యక్తీకరణకు సహాయపడుతుంది. ఎల్లో కలర్ మీ శక్తిని పెంచడంలో దోహదపడుతుంది.
టైం టేబుల్ లో మార్పులు.. మీ రోజు వారి షెడ్యూల్స్ లో మార్పులు జరుగుతాయి. రోటీన్ వర్క్ నుంచి కాస్త బయటకు వచ్చిన ఫీల్ ఉంటుంది. చుట్టూ కోలాహలం ఉండటంతో ప్రజలు తమని తాము స్వేచ్ఛగా మార్చుకోగలగుతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..