
మీరు తరచుగా నొప్పులు.. మీ పాదాలు లేదా మోకాళ్లలో నొప్పిని అనుభవించినా.. అలాగే.. మీ కాలి – పెద్ద కాలి వేళ్లలో, చేతుల వేళ్లలో నొప్పి పెరిగితే, ఇది పెరిగిన యూరిక్ యాసిడ్ లక్షణం కావచ్చు. పెరిగిన యూరిక్ యాసిడ్ స్థాయిలు అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. యూరిక్ యాసిడ్.. అనేది ప్యూరిన్‌లు విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడే సహజ వ్యర్థ పదార్థం.. ఇది రక్తంలో కరిగి, మూత్రపిండాల ద్వారా మూత్రంలో బయటకు వెళ్తుంది. అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు (హైపర్యూరిసిమియా) కీళ్లలో స్ఫటికాలు ఏర్పడటానికి కారణమై, గౌట్ (ఒక రకమైన కీళ్ల నొప్పులు), మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తుంది. దీనికి కారణాలు అధిక ప్యూరిన్ ఆహారాలు, ఆల్కహాల్, జన్యుశాస్త్రం, కిడ్నీ సమస్యలు కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎందుకు పెరుగుతుంది..? దానిని ఎలా నియంత్రించవచ్చు..? అనే విషయాలపై ఢిల్లీలోని RML హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
మన ఆహారం సరిగా లేనప్పుడు, శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయని డాక్టర్ సుభాష్ వివరిస్తున్నారు. ఇది అధిక ప్రోటీన్ ఆహారాలు – అధిక ఎర్ర మాంసం తినడం వల్ల కూడా సంభవించవచ్చు. శరీరంలో ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుందని డాక్టర్ గిరి వివరిస్తున్నారు. ఇది వ్యర్థ ఉత్పత్తి – మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. అయితే, మనం అధిక ప్రోటీన్ ఆహారం తీసుకున్నప్పుడు, మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.. వాటిని పూర్తిగా తొలగించకుండా నిరోధిస్తుంది.. దీంతో అది రక్తంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
రెడ్ మీట్, మటన్, కిడ్నీ బీన్స్, పప్పులు, కాలీఫ్లవర్, పుట్టగొడుగులు, పాలకూరలో ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ కూడా పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండటం మంచిది..
చక్కెర పానీయాలు, ఆల్కహాల్ – బీరు తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.
శరీరంలో నీరు లేకపోవడం వల్ల, తగినంత మూత్రం ఉత్పత్తి అవ్వదు.. యూరిక్ యాసిడ్ శరీరం నుండి బయటకు వెళ్ళలేకపోతుంది.
కుటుంబంలోని ఎవరికైనా యూరిక్ యాసిడ్ పెరిగినట్లు ఫిర్యాదు ఉంటే, ఇతర సభ్యులకు కూడా అలాంటి ఫిర్యాదు ఉండే అవకాశం ఉంది.
కీళ్ల నొప్పి లేదా వాపు
కదలిక సమస్యలు లేదా ఆర్థరైటిస్
మంట లేదా తరచుగా మూత్రవిసర్జన
అలసట, జ్వరం, వికారం, బలహీనత
రెడ్ మీట్ (ఎర్ర మాంసం), కిడ్నీ బీన్స్ – కాలీఫ్లవర్ వినియోగాన్ని తగ్గించండి.
మీ ఆహారంలో గంజి, తృణధాన్యాలు, పండ్లు – ఆకుపచ్చ కూరగాయల పరిమాణాన్ని పెంచండి.
పాల ఉత్పత్తులు – నిమ్మ, నారింజ వంటి విటమిన్ సి ఉన్న పండ్లను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.
యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జించబడటానికి రోజుకు 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగాలి.
కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు లేదా ఆమ్లా రసం కూడా ఆహారంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
మీకు ఏమైనా సమస్యలుంటే నేరుగా వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం మంచిది..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..