చలికాలం మొదలైంది. ఈ చలిలో వెచ్చగా నిద్రపోవాలని చాలా మందికి అనిపిస్తుంది. చలిలో శరీరాన్ని రక్షించుకోవడానికి చాలా మంది దుప్పట్లు, వెచ్చని స్వెటర్లను ఉపయోగిస్తారు. కానీ కొందరికి రాత్రి పడుకునేటప్పుడు తల నుంచి పాదాల వరకు బెడ్ షీట్ ఫుల్లుగా కప్పుకునే అలవాటు ఉంటుంది. కానీ ఇలా పడుకోవడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నిద్ర అలవాటు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
చలికాలంలో ముఖంపై బెడ్‌షీట్ వేసుకుని పడుకోవడం వల్ల మీరు శ్వాస నుంచి వెలువడే అపరిశుభ్రమైన గాలి బయటకు వెళ్లదు. ఈ చెడు గాలి చర్మం రంగు మారడానికి కారణమవుతుంది. అంతేకాకుండా చర్మం ముడతలు, మొటిమలు సహా ఇతర చర్మ సమస్యలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ముఖానికి దుప్పటి కప్పుకుని నిద్రించడం వల్ల ఊపిరితిత్తులకు గాలి అందదు. దీని వల్ల ఊపిరితిత్తులు సంకోచించుకుపోతాయి. ఇలాంటి అలవాటు వల్ల క్రమంగా తలనొప్పి, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నిండా దుప్పటి తన్ని నిద్రించడం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం సరైన మోతాదులో ప్రవహించదు.
ముఖంపై దుప్పటి కప్పుకుని నిద్రపోతే ఆక్సిజన్ అందదు. దీనివల్ల విపరీతమైన అలసట కలుగుతుంది. అంతే కాకుండా తలనొప్పి, వికారం, తల తిరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
తలపై దుప్పటి కప్పుకుని నిద్రించడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడి జుట్టు రాలడానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తల నుండి కాలి వరకు దుప్పట్లు ధరించి నిద్రించే అలవాటు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని కారణంగా శరీరానికి చెమటలు పట్టడం ప్రారంభిస్తుంది. దీనివల్ల నిద్ర సరిగా పట్టదు.
తల నుంచి కాలి వరకు దుప్పటి కప్పుకుని నిద్రించే అలవాటు వల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు. ఈ అలవాటుతో గుండెపోటు, శ్వాసకోశ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.