Hibiscus Flower Benefits: ఆరోగ్యానికి దివ్యౌషధం మందార పువ్వు.. ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు..!

|

Mar 24, 2023 | 10:34 PM

మందార పువ్వుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. మందార పువ్వు చర్మం, జుట్టు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా దివ్యౌషధంగా పని చేస్తుంది. ఈ పువ్వు అందానికి, అలంకారానికే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఉపకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Hibiscus Flower Benefits: ఆరోగ్యానికి దివ్యౌషధం మందార పువ్వు.. ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు..!
Hibiscus Flower
Follow us on

మందార పువ్వుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. మందార పువ్వు చర్మం, జుట్టు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా దివ్యౌషధంగా పని చేస్తుంది. ఈ పువ్వు అందానికి, అలంకారానికే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఉపకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మందార పువ్వులను తినడం వల్ల అనేక వ్యాధులు నయం అవుతాయంటున్నారు. మరి మందారను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. రక్తపోటును తగ్గిస్తుంది:

మందార ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి రక్తపోటును తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. మందార టీ తయారు చేసి త్రాగడం వల్ల సిస్టోలిక్ రక్తపోటు 10 పాయింట్ల వరకు తగ్గినట్లు గుర్తించారు. ధమనులలో ఒత్తిడిని కలిగించే డయాస్టొలిక్ రక్తపోటును తగ్గించడంలో మందార టీ ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. మందారలో ఫ్లేవనాయిడ్లు, ఇతర ఫైటోకెమికల్స్ ఉండటం వల్ల ఈ ప్రభావం ఉంటుందన్నారు. ఇవి రక్త నాళాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి.

2. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మందార ప్రభావవంతంగా ఉంటుంది. జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. మందార టీ కొలెస్ట్రాల్ స్థాయిలను 22 శాతం వరకు తగ్గిస్తుంది. ఇందులో అధిక యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

3. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు:

గుండె జబ్బులకు ఇన్‌ఫ్లమేషన్ ముఖ్యమైన కారణం. మందారలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. మందార సారం వాపునకు కారణమయ్యే ఇన్ఫ్లమేటరీ సైటోకిన్‌ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. మందార సారం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలలో తేలింది.

4. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు:

మందారలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో అద్భుతంగా పని చేస్తాయి. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. మందారలో అధిక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. ఈ వివరాలను టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనలు పాటించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..