Foreign Vacation:సెలవుల్లో విదేశాలకు వెళ్లాలనుకొంటున్నారా? ఇలా ప్లాన్ చేస్తే ఆర్థికంగా ఇబ్బందులుండవు..

|

Apr 03, 2023 | 5:00 PM

మీ వకేషన్ ప్లానింగ్‌లో బడ్జెట్ ను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దేనికెంత ఖర్చు అవుతుందో అంచనా వేసుకోవాలి. ఇప్పటి నుంచి ఎంత డబ్బులు ఆదా చేస్తే మన ఖర్చులు అన్నీ సరిపోను పోగవుతాయో అర్థం చేసుకొని అవగాహనకు రావాలి. అప్పుడు మీరు మీ ఖాతాల్లోని అదనపు నగదును వినియోగించాల్సిన అవసరం ఉండదు.

Foreign Vacation:సెలవుల్లో విదేశాలకు వెళ్లాలనుకొంటున్నారా? ఇలా ప్లాన్ చేస్తే ఆర్థికంగా ఇబ్బందులుండవు..
Foriegn Trip In Budget
Follow us on

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రపంచంలోని అన్ని దేశాలు పర్యాటకులను ఆహ్వనిస్తున్నాయి. మీరు మీ కుటుంబంతో విదేశీ పర్యటనకు వెళ్లాలంటే ఇదే సరైన సమయం. అయితే ఇందుకోసం సరైన ప్లానింగ్ అవసరం. ముఖ్యంగ ఆర్థిక ప్రణాళిక అవసరం. ఎందుకంటే కొత్త బడ్జెట్ అమలులోకి వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మారిన నిబంధనలు, ట్యాక్స్ విధానం తదితరాలు గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా విదేశాలు వకేషన్ వెళ్లాలనుకునే వారి ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్(టీసీఎస్) గురించి తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టీసీఎస్ అంటే..

టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్. మీరు ఏజెంట్ వద్ద నుంచి ఏదైనా ఫారెన్ టూర్ ప్యాకెజ్ కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ఈ టీసీఎస్ కు లోబడే చేయాల్సి ఉంటుంది. అందులోనే వసతి, ఆహారం, ప్రయాణ ఖర్చులు వంటివి ఉంటాయి. అయితే బడ్జెట్ 2023లో లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద విదేశీ రెమిటెన్స్‌లకు టీసీఎస్ రేటు 5% నుండి 20%కి పెరిగింది. ఇది ఈ ఏడాది జూలై 1వ తేదీ నుండి వర్తిస్తుంది. ఇంతకుముందు, విదేశీ ఖర్చులు సంవత్సరానికి రూ. 7 లక్షలలోపు ఉండే వ్యక్తులు ప్లాన్ చేసిన విదేశీ పర్యటనలకు ఇది వర్తించేది కాదు . అయితే, ఈ సంవత్సరం జూలై నుండి, అటువంటి పరిమితి లేదు. అన్ని విదేశీ ఖర్చులపై 20% టీసీఎస్ వర్తిస్తుంది.

టీసీఎస్ అదనపు పన్ను కాదు.. ఇది టీడీఎస్ లాగా పనిచేస్తుంది. అయితే, ఇది మీరు నగదు ఖర్చు చేసే సమయంలో నగదు ప్రవాహాన్ని పెంచుతుంది. ఈ టీసీఎస్ ను ఏదైనా చెల్లించాల్సిన పన్ను లేదా ముందస్తు పన్ను అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఒకవేళ టీసీఎస్ కారణంగా అదనపు పన్ను చెల్లింపు జరిగితే దానిని తిరిగి చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

  • మీరు మీ ట్రిప్‌ను ముందుగానే ప్లాన్ చేసుకుంటే, ప్రయాణ టికెట్లు, హోటళ్లలో వసతి వంటివి మీ ప్రాధాన్యాల ప్రకారం బుక్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ బుకింగ్‌లతో పోలిస్తే చివరి నిమిషంలో బుకింగ్‌లు సాధారణంగా ఖర్చుతో కూడుకున్నవి. అందువల్ల, మీ ట్రిప్ ప్లాన్ 5 నుండి 6 నెలల ముందుగానే రెడీ చేసుకోవాలి.
  • మీ వకేషన్ ప్లానింగ్‌లో బడ్జెట్ ను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దేనికెంత ఖర్చు అవుతుందో అంచనావేసుకోవాలి. ఇప్పటి నుంచి ఎంత డబ్బులు ఆదా చేస్తే మన ఖర్చులు అన్నీ సరిపోను పోగవుతాయో అర్థం చేసుకొని అవగాహనకు రావాలి. అప్పుడు మీరు మీ ఖాతాల్లోని అదనపు నగదును వినియోగించాల్సిన అవసరం ఉండదు.
  • వెకేషన్ ప్లానింగ్‌లో మరో కీలకమైన అంశం ప్రయాణ బీమా. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో, లేదా మీరు, మీ కుటుంబం ప్రయాణిస్తున్నప్పుడు మీ వస్తువులు దొంగతనానికి గురవడం, లేదా వస్తువులు డ్యామేజ్ కావడం వంటివి జరిగినప్పుడు ఈ బీమా వల్ల నస్టం తగ్గుతుంది. మీ అన్ని అవసరాలను తీర్చే ప్రయాణ బీమా కోసం వెతికి కొనుగోలు చేయాలి.
  • అలాగే మీరు ఆఫ్-సీజన్‌లో మీ వెకేషన్‌ను ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే తక్కువ డిమాండ్ కారణంగా ఇది మీకు తక్కువ ఖర్చు అవుతుంది.
  • మీరు ప్రయాణ బడ్జెట్, మీరు పొదుపు చేయవలసిన మొత్తాన్ని నిర్ణయించిన తర్వాత, మీ లక్ష్యాన్ని సాధించడానికి తదనుగుణంగా పలు పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టాలి. దాని నుంచి వచ్చే మొత్తం మిమ్మల్ని మీ టూర్ సమయంలో స్వేచ్ఛగా ఉండటానికి తోడ్పడుతుంది.
  • మీ వకేషన్ కోసం టిక్కెట్లు లేదా ప్యాకేజీలను బుకింగ్ చేయడానికి అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. జూలై నుండి టీసీఎస్ పెరుగుతోంది. అంటే విదేశీ టూర్ ప్యాకేజీ ఖర్చు దాదాపు 15 శాతం అధికమవుతుంది.
  • ఆర్థిక ప్రణాళికతో పాటు, లావాదేవీ మాధ్యమం పరంగా మీరు ఎలా చెల్లింపులు చేస్తారో కూడా మీరు ఆలోచించాలి. కరెన్సీ మార్పిడి రేటు మీ బడ్జెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, మీ ప్రయాణానికి కనీసం ఒకటి నుండి రెండు నెలల ముందు దీని కోసం ప్లాన్ చేసుకోవడం మంచిది.
  • సాధారణంగా, విమానాశ్రయ కరెన్సీ మార్పిడి, విదేశీ మారక ద్రవ్య బ్యూరోలు అధిక/అదనపు రుసుములను వసూలు చేస్తాయి; అందువల్ల, వాటి రేట్లు మీకు అనుకూలంగా ఉండవు. ఇక్కడ పరిష్కారం ఏమిటంటే, మీరు సందర్శించాలనుకుంటున్న దేశాలలో మీరు ఎక్కడ సహేతుకమైన మార్పిడి రేటును పొందవచ్చో ముందుగానే తెలుసుకోవచ్చు. అందుకు ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్‌ని పొందడం ఒక సులభమైన పరిష్కారం. ఈ కార్డ్‌లు సాధారణంగా మెరుగైన రేట్లు, కరెన్సీ హెచ్చుతగ్గుల నుండి రక్షణను అందిస్తాయి, మీ ప్రయాణానికి ముందుగా మారకం రేటును లాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..