Health Tips: విటమిన్‌ డి ఓవర్‌డోస్ అయితే కనిపించే సమస్యలివే.. జాగ్రత్త పడండి.. లేకపోతే అంతే సంగతి..!

|

Apr 01, 2023 | 1:40 PM

Health Care tips: శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్ డి కూడా ఒకటి. కానీ దాని మోతాదు అధికమైతే అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అవేమిటంటే.

Health Tips: విటమిన్‌ డి ఓవర్‌డోస్ అయితే కనిపించే సమస్యలివే.. జాగ్రత్త పడండి.. లేకపోతే అంతే సంగతి..!
Vitamin D
Follow us on

Health Care tips: మన శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్ డి కూడా ఒకటి. ఇది మన ఆరోగ్యమాన్ని కాపాడటంలో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మన శరీరంలో విటమిన్ డి మోతాదు అధికమైతే అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇది వివిధ వ్యాధులకు కారణమవుతుంది. సాధారణంగా విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయడానికి సప్లిమెంట్లను కూడా తీసుకుంటున్నారు. మరి ఈ క్రమంలో శరీరంలో విటమిన్ డి మోతాదు ఎక్కువైతే ఏయే వ్యాధుల బారిన పడతారో ఇప్పుడు తెలుసుకుందాం..

వాంతులు: మీ శరీరంలో విటమిన్ డి అధిక మోతాదులో ఉన్నట్లయితే ఇబ్బందులకు గురవుతారు. ఈ క్రమంలో మీకు వాంతులు, వీరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించాలి.

మానసిక అనారోగ్యం: ఏదైనా ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి నష్టం వాటిల్లుతుందో.. విటమిన్ డి విషయంలో కూడా అంతే. మీరు పరిమితికి మించి విటమిన్ డి తీసుకుంటే మానసిక వ్యాధులను ఎదుర్కొవలసి ఉంటుంది. ఆందోళన, ఒత్తిడి, విసుగు, విరక్తి, ఇంకా తలనొప్పి వంటి వాటిని కూడా ఎదుర్కొంటారు.

ఇవి కూడా చదవండి

ఆకలి లేకపోవడం: విటమిన్ డి తీసుకోవడం కోసం ఇష్టానుసారంగా సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల వారికి తెలియకుండానే శరీరంలో దాని మోతాదు పెరుగుతుందని, ఫలితంగా ఆకలి తగ్గినట్లు చాలా మందికి అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వీటికి బదులుగా మీరు సూర్యకాంతి వంటి సహజ పద్ధతుల ద్వారా విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా ఆరోగ్య పరమైన సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…