Oolong Tea: ఈ చైనీస్ ‘టీ’ గురించి ఎప్పుడైనా విన్నారా? గ్రీన్ టీ.. బ్లాక్ టీ కన్నా ఇదే బెస్ట్.. వివరాలు తెలుసుకోండి..

|

Mar 15, 2023 | 5:00 PM

ఊలాంగ్ టీ నా? కొత్తగా ఉందే పేరు అనుకుంటున్నారా? అవునండీ ఇది కూడా చైన్ ఇంపోర్టెడే. ఇది చైనీయుల సంప్ర‌దాయ టీ. పురాత‌న కాలం నుంచి చైనీయులు ఊలాంగ్ టీని సేవిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌న‌కు కూడా మార్కెట్‌లో ల‌భిస్తోంది.

Oolong Tea: ఈ చైనీస్ ‘టీ’ గురించి ఎప్పుడైనా విన్నారా? గ్రీన్ టీ.. బ్లాక్ టీ కన్నా ఇదే బెస్ట్.. వివరాలు తెలుసుకోండి..
Oolong Tea
Follow us on

చాలా మంది ఉదయం లేవగానే టీ కావాలి. అది తాగనిదే వారికి రోజు ప్రారంభం కాదు. మన దేశంలో అత్యంత ఇష్టంగా తాగే పానియాలలో టీ తప్పనిసరిగా ఉంటుంది. చాలా మంది రోజులో మూడు, నాలుగు సార్లు తాగే వారు కూడా ఉన్నారు. ఈ టీలలో చాలా రకాలు ఉన్నాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ , మసాలా టీ, లెమన్ టీ వంటి అనేక రకాలు ఉన్నాయి. దేని ప్రయోజనాలు దానివి. అయితే అలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన టీల‌లో ఊలాంగ్ టీ కూడా ఒక‌టి. ఊలాంగ్ టీ నా? కొత్తగా ఉందే పేరు అనుకుంటున్నారా? అవునండీ ఇది కూడా చైన్ ఇంపోర్టెడే. ఇది చైనీయుల సంప్ర‌దాయ టీ. పురాత‌న కాలం నుంచి చైనీయులు ఊలాంగ్ టీని సేవిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌న‌కు కూడా ఈ టీ మార్కెట్‌లో ల‌భిస్తోంది. మరి ఈ ఊలాంగ్ టీ తాగితే వచ్చే ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం రండి..

ఎలా తయారు చేస్తారు..

ఇది గ్రీన్ టీ, బ్లాక్ టీని తయారు చేయడానికి ఉపయోగించే కామెల్లియా సైనెసిస్ మొక్క ఆకుల నుంచే ఈ ఊలాంగ్ టీ కూడా తయారు చేస్తారు. కానీ ప్రాసెస్ చేసే విధానంలో తేడా ఉంటుంది. గ్రీన్ టీ ఆక్సీకరణం చెందని తాజా టీ ఆకుల నుంచి ఉత్పత్తి చేస్తారు. ఆక్సీకరణను పెంపొందించడానికి ఆకులను పూర్తిగా చూర్ణం చేసినప్పుడు బ్లాక్ టీ అవుతుంది. అలాగే మరియు పాక్షిక ఆక్సీకరణను సృష్టించేందుకు ఆకులు ఎండలో మాడబెడితే ఊలాంగ్ టీ ఏర్పడుతుంది.

ఊలాంగ్ టీలో పోషకాలు..

తాజాగా తయారుచేసిన ఒక కప్పు ఊలాంగ్ టీలో ఖనిజాలు, విటమిన్లు, పొటాషియం, కాల్షియం మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి. టీ పాలీఫెనాల్స్ అని పిలువబడే ఊలాంగ్ టీలోని కొన్ని ప్రధాన యాంటీఆక్సిడెంట్లు థెఫ్లావిన్‌లు, థియారూబిగిన్స్ ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

ఇవి కూడా చదవండి

డయాబెటిస్ కి చెక్.. ఇది మధుమేహం, దాని వచ్చే సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడం, మంటను తగ్గించడం చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి మేలు.. ఊలాంగ్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సాయపడుతుంది. అన్ని టీలలో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయినప్పటికీ, ఊలాంగ్ టీలోని పోషకాలు గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ ల కంటే బలమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ మ్యుటాజెనిక్ ప్రభావాలను కలిగి ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

బరువు తగ్గడంలో.. ఈ టీ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ఊలాంగ్ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరం మ‌నం తినే ఆహారంలో ఉండే కొవ్వును పేరుకుపోకుండా చూస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌వారు నిత్యం ఊలాంగ్ టీని తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..