Weight Loss Tips: రోజుకు ఆరుసార్లు తినండి.. ఆయాసం లేకుండా బరువు తగ్గిపోండి.. వ్యాయామం, డైటింగ్ అవసరమే లేదు!

|

Mar 20, 2023 | 4:45 PM

బరువు తగ్గాలంటే ఏం చేయాలి? రోజూ వ్యాయామం చేయాలి. డైట్ మెయింటేన్ చేయాలి. జీవన శైలి మార్చుకోవాలి. అయితే ఈవేమి మా వల్ల కాదు అంటారా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు.

Weight Loss Tips: రోజుకు ఆరుసార్లు తినండి.. ఆయాసం లేకుండా బరువు తగ్గిపోండి.. వ్యాయామం, డైటింగ్ అవసరమే లేదు!
Weight Loss
Follow us on

శారీరక శ్రమలేని జీవన శైలి.. అధిక ఒత్తిడితో కూడిన ఉద్యోగ జీవితం.. నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి కారణంగా శరీర బరువు పెరుగుతోంది. ఇటీవల కాలంలో చాలా మంది ఈ అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు పెరుగుతున్న కొద్దీ శరీరానికి వచ్చే రోగాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. శరీర బరువును నియంత్రించుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. అయితే బరువు తగ్గాలంటే ఏం చేయాలి? రోజూ వ్యాయామం చేయాలి. డైట్ మెయింటేన్ చేయాలి. జీవన శైలి మార్చుకోవాలి. అయితే ఈవేమి మా వల్ల కాదు అంటారా? మీ టైం షెడ్యూల్స్ దీనికి అనుమతివ్వడం లేదా? అయితే ఎటువంటి వ్యాయామాలు లేకుండా, డైటింగ్ చేయకుండా శరీర బరువు అదుపులో ఉంచుకునే బెస్ట్ టిప్స్ మీకోసం అందిస్తున్నాం. నిపుణులు చెబుతున్న ఈ విషయాలు మీరు పాటిస్తే సులభంగా బరువు తగ్గిపోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

ఆహారాన్ని బాగా నమిలి తినాలి..

ఆహారాన్ని తినేటప్పుడు నెమ్మదిగా తినాలి. వేగంగా తినకూడదు. నోట్లో ఆహారాన్ని ఎక్కువ సేపు నమలాలి. ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండానే తక్కువ ఆహారాన్ని తింటారు. నిదానంగా తినే వారి కంటే వేగంగా తినేవారు బరువు పెరిగే అవకాశం ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. వేగంగా తింటున్నప్పుడు ఎంత తింటున్నారో తెలియకుండా ఎక్కువ మొత్తం తినేస్తారని, దీని వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు.

ఆరుసార్లు తినండి..

ఉదయం నుంచి రాత్రి వరకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అని మూడు పూటలు మీరు భోజనం చేస్తారు. బరువు తగ్గాలనుకునేవారు మాత్రం ఆరు నుంచి ఏడు సార్లు తినాలి. అది కూడా చాలా తక్కువ మొత్తంలో. ఇలా చిన్న చిన్న భాగాలుగా ఆహారాన్ని చేసుకుని తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ఏడు భాగాలను కలిపినా కూడా మీరు మూడు పూటలా తినేంత ఆహారం ఉండకూడదు.

ఇవి కూడా చదవండి

ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండాలి..

మీరు తీసుకొనే ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ప్రొటీన్ ఉన్న ఆహారం తింటే పొట్ట నిండిన భావన త్వరగా వస్తుంది. ఆకలి కూడా తగ్గిపోతుంది. చికెన్, చేపలు, పెరుగు, బాదంపప్పులు, క్వినోవా వంటివి వాటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రోటీన్ లాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కూడా త్వరగా పొట్ట నిండిన భావన వస్తుంది. మొలకలు, నారింజలు, అవిసె గింజలు వంటివి తినేందుకు ప్రయత్నించండి.

నీరు అధికంగా తాగాలి..

నీరు ఎక్కువగా తాగితే ఆకలి తగ్గుతుంది. నీరు తాగడం వల్ల తక్కువగా తినే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఏదైనా భోజనం చేసే కొంత సమయం ముందు నీరు ఎక్కువ తాగండి. అప్పుడు ఆహారం తక్కువ తీసుకుంటారు. అలాగే ఆహారం తింటున్నప్పుడు టీవీ, ఫోను చూడడం మానేయండి. వాటి ధ్యాసలో పడి ఎంత తింటున్నారు? అనేది కూడా మీకు తెలియదు. దీనివల్ల ఎక్కువ తినేసే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని అధ్యయనాలు కూడా నిరూపించాయి.

ఇవి అస్సలు వద్దు..

పిజ్జాలు, బర్గర్లు, తీపి పదార్థాలు, కేకులు వంటి వాటిని దూరం పెట్టండి. సోడా, కూల్ డ్రింకులు వంటివి పూర్తిగా మానేయాలి. ఈ చక్కెర కలిపిన పానీయాలు బరువు త్వరగా పెరిగేలా చేస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..