
నేటి కాలంలో గుండె జబ్బులు పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరినీ ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది యువకులు, చిన్న పిల్లలు గుండెపోటుతో మృతి చెందారు. దీనికంతటికీ కారణం మనం తినే ఆహారాలు, మన తప్పుడు దిన చర్యలే కారణం అంటున్నారు నిపుణులు. అందువల్ల, గుండె జబ్బులను ఎలా నివారించాలో నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం చాలా అవసరం. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదం చేసే 5 రకాల పండ్లు ఇవే. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
బ్లూబెర్రీస్‌లో ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. రక్తపోటును తగ్గిస్తుంది.
యాపిల్స్ ఫైబర్ కు మంచి మూలం. గుండెకు మేలు చేసే ఆమ్లాలు ఇందులో అధికంగా ఉంటాయి. పెక్టిన్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది. ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
దానిమ్మ గుండె ఆరోగ్యానికి మేలు చేసే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. దీన్ని తినడం రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె సామర్థ్యం పెరుగుతుంది. రక్తపోటు, పిత్త సమతుల్యతను కాపాడుకోవడం సాధ్యమవుతుంది.
అవకాడోలు గుండెకు ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటాయి. ఇందులో పొటాషియం, విటమిన్ కె అధికంగా ఉంటాయి. ఇందులో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అవకాడో జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.
మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్ చేయండి.