Health Tips: మధ్యాహ్న భోజనం ఏ సమయంలో చేయాలి? 2 గంటలు దాటితే చేయొచ్చా? కీలక వివరాలు మీకోసం..

|

Dec 13, 2022 | 6:02 PM

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరి లైఫ్‌ స్టైల్ మారిపోయింది. చేసే పనుల్లో మార్పులతో పాటు.. జీవనశైలిలో కూడా భారీ మార్పులు వచ్చాయి. ఫలితంగా సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం..

Health Tips: మధ్యాహ్న భోజనం ఏ సమయంలో చేయాలి? 2 గంటలు దాటితే చేయొచ్చా? కీలక వివరాలు మీకోసం..
Follow us on

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరి లైఫ్‌ స్టైల్ మారిపోయింది. చేసే పనుల్లో మార్పులతో పాటు.. జీవనశైలిలో కూడా భారీ మార్పులు వచ్చాయి. ఫలితంగా సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం వంటి పరిస్థితి ఏర్పడింది. తద్వారా అనారోగ్యానికి గురయ్యే జనాల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, ఇక మరో కీలక విషయం ఏంటంటే.. తినే సమయం కూడా ఇక్కడ కీలకమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మధ్యాహ్నం 1, 2, 3 గంటలకు ఏ సమయంలో తింటున్నారో కాస్త శ్రద్ధ వహించాలంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఉదయం అల్పాహారం ఆలస్యంగా తీసుకుంటే.. మధ్యాహ్నం ఏ సమయంలో భోజనం చేయాలనేది చాలా కీలకం. అందుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భోజనానికి సరైన సమయం ఏది?

ఆఫీసు పని అయినా, ఇంటి పని అయినా సరే, మధ్యాహ్న భోజనానికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. ఎందుకంటే మధ్యాహ్న భోజనం శరీరానికి రోజంతా పని చేసే శక్తిని ఇస్తుంది. చాలా మంది రోజులో మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు తినడానికి సరైన సమయంగా భావిస్తారు. కానీ అది అస్సలు కాదని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల లోపు మాత్రమే ఆహారం తినాలని సూచిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ముందు అల్పాహారం తీసుకుంటే.. 2 గంటలలోపు మధ్యాహ్నం భోజనం చేయాలి. ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు టీ తాగొచ్చు. ఒకవేళ ఆకలిగా అనిపిస్తే అల్పాహారం తీసుకోవచ్చు.

శరీరం చురుగ్గా ఉంటుంది..

సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. మీరు ఏ పని చేసినా సరే.. ఆహారం కోసం కొంత టైమ్ సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. రోజువారీ భోజనానికి నిర్ణీత సమయాన్ని ఉంచుకుంటే.. జీవక్రియ మెరుగుపడుతుంది. సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యకరమైన ఆహారం..

ప్రతి రోజూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉంటారు. సమయానికి ఆహారం తీసుకోవడంతో పాటు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..