Health Tips: అరికాళ్లలో మంటలు, దురద వస్తున్నాయా? అయితే ఇలా తగ్గించుకోండి..

|

May 15, 2022 | 8:10 PM

Health Tips: చాలా సార్లు మధుమేహం కారణంగా కూడా పాదాల్లో మంట మొదలవుతుంది. థైరాయిడ్‌ హార్మోన్‌ తగినంత ఉత్పత్తి కాకపోవటం (హైపోథైరాయిడిజమ్‌), దీర్ఘకాల కిడ్నీ జబ్బులు, రోగనిరోధకశక్తి తగ్గిపోవడం, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ వంటి వాటి కారణంగా కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి

Health Tips: అరికాళ్లలో మంటలు, దురద వస్తున్నాయా? అయితే ఇలా తగ్గించుకోండి..
Follow us on

చాలామంది అరికాళ్లలో మంట, దురద వంటి సమస్యలను తరచుగా ఎదుర్కొంటున్నారు. వేసవిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పాదాలు పొడిబారడం, యూరిక్ యాసిడ్ పెరగడం, క్యాల్షియం, విటమిన్ డి లోపం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. చాలా సార్లు మధుమేహం కారణంగా కూడా పాదాల్లో మంట మొదలవుతుంది. థైరాయిడ్‌ హార్మోన్‌ తగినంత ఉత్పత్తి కాకపోవటం (హైపోథైరాయిడిజమ్‌), దీర్ఘకాల కిడ్నీ జబ్బులు, రోగనిరోధకశక్తి తగ్గిపోవడం, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ వంటి వాటి కారణంగా కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. కొందరికి మానసిక ఒత్తిడి, ఆందోళన సమస్యలతోనూ అరికాళ్లలో మంటలు రావొచ్చు. ఇక ఆడవారిలో నెలసరి నిలిచిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి వారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు కొన్ని చిట్కాలు పాటించాలి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

పసుపు

పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పాదాల మంట, దురద నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇందుకోసం పసుపులో కొంచెం కొబ్బరినూనె కలిపి పాదాలకు రాసుకోవాలి. దీంతో పాదాలకు విశ్రాంతి లభిస్తుంది. పసుపు యాంటీబయాటిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పాదాల ఇన్ఫెక్షన్, చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఉప్పు నీటితో..

అరికాళ్లలో మంటలు, దురద సమస్యలను వదిలించుకోవడానికి ఇది చాలా పాత పద్ధతి. ఇందుకోసం ఒక బకెట్‌ను నీటితో నింపండి. అందులోకి కొంచెం రాతి ఉప్పు కలపండి. అందులోపాదాలను కొంత సమయం పాటు ఉంచండి. ఈ నీటిలో కాస్త వెనిగర్ కూడా జోడించవచ్చు. దీంతో పాదాలకు విశ్రాంతి లభిస్తుంది.

కలబందతో..

కలబంద, కొబ్బరి నూనె, కర్పూరం సహాయంతో ఈ సమస్యలను అధిగమించవచ్చు. ఇందు కోసం కలబంద, కొబ్బరి నూనె, కర్పూరం మిక్స్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరికాళ్లకు పట్టించాలి. దీనివల్ల పాదాల్లో మంటలు తగ్గుతాయి.

తగినంత నీరు..

వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలా సార్లు, శరీరంలో అధిక టాక్సిన్ కారణంగా, పాదాలలో మంట, దురద ఉంటుంది. ఎక్కువ మొత్తంలో నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Thomas Cup 2022: భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు మోడీ, జగన్‌ అభినందనలు.. రూ. కోటి నజరానా ప్రకటించిన కేంద్ర మంత్రి..

LSG vs RR Live Score, IPL 2022 : నిలకడగా ఆడుతోన్న రాజస్థాన్.. స్కోరెంతంటే..

Viral Video: కొత్తగా పెళ్లైన కోడలిని రోటీలు చేయమన్న అత్త.. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే నవ్వులే నవ్వులు..