Health Tips: కాలిపై కాలు వేసుకునే అలవాటు ఉందా? ఎంత ప్రమాదకరమో తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు..!

|

Sep 30, 2023 | 7:18 AM

Health Tips: కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఎవరైనా కంఫర్ట్‌గా ఉంటుంది. నిరంతరంగా కూర్చునే వారికి ఇది కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. అయితే, కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల హానీ కలిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల కలిగే అనార్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కూర్చోవడం, లేవడం చేస్తున్నప్పటికీ..

Health Tips: కాలిపై కాలు వేసుకునే అలవాటు ఉందా? ఎంత ప్రమాదకరమో తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు..!
Cross Leg Sitting Position
Follow us on

Health Tips: కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఎవరైనా కంఫర్ట్‌గా ఉంటుంది. నిరంతరంగా కూర్చునే వారికి ఇది కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. అయితే, కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల హానీ కలిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల కలిగే అనార్థాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కూర్చోవడం, లేవడం చేస్తున్నప్పటికీ.. చాలా మంది రిలాక్స్ కోసం కాలిపై కాలు వేసుకుని హాయిగా కూర్చుంటారు. దీని క్రాస్ లెగ్ సిట్టింగ్ యాంగిల్ అంటారు. ఇంట్లో, ఆఫీసుల్లో చాలా మంది ఇలా కూర్చుంటారు. ముఖ్యంగా మహిళలు ఇలా కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం ద్వారా చాలా కంఫర్ట్ ఉంటుందని అంటారు. కానీ, అలా కూర్చోవడం శారీరానికి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మహిళల కంటే పురుషులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరి కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం కలిగే నష్టాలేంటో ఓసారి చూద్దాం..

మగవారు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల కలిగే నష్టాలివే..

1. కాళ్లకు అడ్డంగా కూర్చునే పురుషులలో వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్‌పై దుష్ప్రభావం చూపుతుందని ఓ పరిశోధనలతో తేలింది.

2. కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం వలన ఎముకలు కూడా దెబ్బతింటాయి. దిగువ వీపు, తుంటిపై చెడు ప్రభావం చూపుతుంది.

3. ముఖ్యంగా వెన్నెముక నొప్పిని కలిగిస్తుంది. అంతేకాఉండా.. తుంటి బరువు కూడా వేగంగా పెరగడం మొదలవుతుంది. కాళ్లు అడ్డంగా పెట్టుకుని కూర్చోవడం వలన పొట్టపైనా చెడు ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియలో సమస్యలు ఏర్పాడుతాయి. పొట్టలో వాపు, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా పెరుగుతాయి.

4. కాళ్లను ఒకదాని మీద ఒకటి వేసుకుని కూర్చోవడం వలన శరీరంలో రక్త ప్రసరణ కూడా సరిగా ఉండదు. ఇది మీ కాళ్ళలో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. కాళ్ళలో వాపునకకు కారణం అవుతుంది.

5. కాళ్లను ఒక దాని మీద మరొకటి అడ్డంగా వేసుకుని కూర్చోవడం వలన కండరాలలో అసమతుల్యత ఏర్పడుతుంది. దీని కారణంగా తుంటి, కటి ప్రాంతం ఆకారం చెడిపోయే ప్రమాదం ఉంది. చాలా మంది ఈ అలవాటు కారణంగా వెన్ను కింది భాగంలో నొప్పి మొదలవుతుంది.

6. కొన్ని సందర్భాల్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నప్పుడు కాళ్లలో తిమ్మిరి వస్తుంది. పెరోనియల్ నరాల మీద ఒత్తిడి ఏర్పడి.. ఇది తిమ్మిరికి దారి తీస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..