Health tips: ఉప్పు కలిపిన నీళ్ళతో స్నానం చేస్తే బోలెడు లాభాలు..! తెలిస్తే ఇకపై కంటిన్యూ చేస్తారు..

|

Aug 09, 2024 | 10:24 PM

చర్మం ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉండేలా ఉప్పులోని ఖనిజాలు దోహదపడతాయి. చర్మం ముడతలు పడుతుంటే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారు ఉప్పునీటితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉప్పు నీటి స్నానం మాయిశ్చ‌రైజ‌ర్‌లా ప‌నిచేస్తుంది. ఉప్పులో ఉండే ల‌వ‌ణాలు శ‌రీరంపై తేమ‌ను బంధించి మాయిశ్చ‌రైజ‌ర్‌లా వ్య‌వ‌హ‌రిస్తాయి.

Health tips: ఉప్పు కలిపిన నీళ్ళతో స్నానం చేస్తే బోలెడు లాభాలు..! తెలిస్తే ఇకపై కంటిన్యూ చేస్తారు..
Bath In Salt Water
Follow us on

ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో.. శారీరక శుభ్రత కోసం స్నానం తప్పనిసరి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేయడం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది. అయితే, స్నానం చేసే నీటిలో ఉప్పువేసుకుని చేస్తే ఏమవుతుందో తెలుసా..? అదేంటి.. అందరూ స్నానానికి మంచినీటి వాడుతుంటారు కదా.. ఉప్పు నీరేంటి అనే సందేహం కలుగొచ్చు..ఉప్పునీటితో స్నానం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా, స్నానం చేసే నీటిలో కాస్తంత ఉప్పు వేసుకున్నట్టయితే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని సూచిస్తున్నారు. ఉప్పునీటి స్నానంఉప్పులో చాలా ఔష‌ధ గుణాలు ఉంటాయి. వంట‌ల‌్లో ఎక్కువ‌గా వాడే ఉప్పును ప్రస్తుతం స్నానం చేయ‌డ‌టానికి కూడా వాడుతున్నారు. ఈ ఉప్పునీటి స్నానం చేస్తే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఉప్పు నీటితో స్నానం చేస్తే చర్మంపై మచ్చలు తొలగిపోతాయి. ఉప్పు నీటితో స్నానం చేస్తే ఉప్పులో ఉండే ఖ‌నిజాలు చ‌ర్మాన్ని చైత‌న్య‌వంతంగా మారుస్తాయి. అలాగే చ‌ర్మానికి కావాల్సిన పోష‌కాల‌ను అందిస్తాయి. య‌వ్వ‌నంఉప్పు నీటి స్నానం రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల‌్ల ముఖంపై ముడ‌త‌ల‌ు త‌గ్గించుకోవ‌చ్చు. దీంతోపాటు చ‌ర్మం మ‌రింత మృదువుగా అందంగా మారి మీరు య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉప్పు కలిపిన నీటితో సున్నితంగా శరీరాన్ని మర్దనా చేసుకుంటే రక్తప్రసరణ తీరు మెరుగవుతుంది.

ఆర్థ‌రైటిస్‌ఉప్పునీటి స్నానం చేయ‌డం వ‌ల‌్ల ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మాన‌సిక ఆరోగ్యంఉప్పునీటి స్నానం రోజూ చేస్తే మ‌న భౌతిక ఆరోగ్యంతోపాటు మాన‌సిక ఆరోగ్యం కూడా మెరుగ‌వుతుంది. ఈ స్నానం చేసిన త‌రువాత ప్ర‌శాంత‌త పొంద‌వ‌చ్చు. ఎసిడిటీఉప్పు నీటి స్నానం చేయ‌డం వ‌ల‌్ల ఎసిడిటీ స‌మ‌స్య త‌గ్గుతుంది. ఉప్పులో ఉండే ల‌వ‌ణాలు ఆమ్ల‌త్వం త‌గ్గించ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి. పాదాల కండ‌రాలకు బ‌లంమ‌న శ‌రీరంలో ఎక్కువ ఒత్తిడికి గుర‌య్యే భాగం పాదాలు. ఉప్పునీటి స్నానం చేయ‌డం వ‌ల‌్ల పాదాల కండ‌రాలు బ‌లంగా తయార‌వుతాయి.

ఇవి కూడా చదవండి

ఉప్పు నీటి వల్ల పాదాలు, చేతి వేళ్ల మధ్య మురికిదనం తొలగిపోతుంది. టాక్సిన్లు, బ్యాక్టీరియా బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే ఉప్పు నీటితో స్నానం చేస్తుండాలి. చర్మం ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉండేలా ఉప్పులోని ఖనిజాలు దోహదపడతాయి. చర్మం ముడతలు పడుతుంటే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారు ఉప్పునీటితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉప్పు నీటి స్నానం మాయిశ్చ‌రైజ‌ర్‌లా ప‌నిచేస్తుంది. ఉప్పులో ఉండే ల‌వ‌ణాలు శ‌రీరంపై తేమ‌ను బంధించి మాయిశ్చ‌రైజ‌ర్‌లా వ్య‌వ‌హ‌రిస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..