Nails Cutting: రాత్రిపూట గోళ్లు కొరుకుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది..!

|

Mar 03, 2022 | 10:05 PM

Nails Cutting: సాధారణంగా రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదని అంటారు. అంతేకాదు రాత్రి పూట ఇంట్లో గోళ్లు కొరికితే పెద్దలు కూడా మందిలిస్తారు. వాస్తవానికి ఈ ప్రశ్నకు సరైన

Nails Cutting: రాత్రిపూట గోళ్లు కొరుకుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది..!
Nails Cutting
Follow us on

Nails Cutting: సాధారణంగా రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదని అంటారు. అంతేకాదు రాత్రి పూట ఇంట్లో గోళ్లు కొరికితే పెద్దలు కూడా మందిలిస్తారు. వాస్తవానికి ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం చాలాకష్టం. కానీ కొన్ని కారణాలు మాత్రం ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం.. మన గోర్లు కెరాటిన్‌తో నిర్మితమై ఉంటాయి. అందుకే స్నానం చేసిన తర్వాత గోళ్లను కత్తిరిస్తే ఉత్తమం. ఎందుకంటే అప్పుడు మన గోర్లు నీటిలో లేదా సబ్బు నీటిలో నాని మెత్తగా అవుతాయి. దీంతో తేలికగా కత్తిరించవచ్చు. కానీ రాత్రిపూట కట్‌ చేయాలంటే ఆ సమయానికి గోళ్లు మెత్తబడి ఉండవు కదా.. అప్పుడు కట్‌ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు అవి దెబ్బతినే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదనే విషయం వెనుక మరొక కారణం కూడా ఉంది. పాత రోజుల్లో, నెయిల్ కట్టర్లు ప్రజల వద్ద అందుబాటులో లేవు.

ఆ రోజుల్లో కత్తితో గాని, పదునైన పనిముట్లతో గోళ్లు కత్తిరించేవారు. అప్పట్లో కరెంటు ఉండేది కాదు. అందుకే పెద్దలు చీకట్లో గోళ్లు కత్తిరించడాన్ని నిషేధించేవారు. కానీ కాలం గడిచేకొద్దీ దీనికి మూఢనమ్మకాలని ఆపాదించారు. కొంతమంది ఇప్పటికీ వీటిని నమ్ముతారు. పిల్లలను కూడా అనుసరించమని చెబుతారు. గోళ్లను కత్తిరించడానికి సరైన మార్గం ముందుగా మీ గోళ్లను తేలికపాటి నూనెలో లేదా నీటిలో పెట్టాలి. ఇది మీ గోళ్లను మృదువుగా చేస్తుంది. అప్పుడు వాటిని బాగా కత్తిరించవచ్చు. గోర్లు కత్తిరించిన తర్వాత చేతివేళ్లని నీటితో కడగాలి. అప్పుడు అవి మృదువుగా తయారవుతాయి. అంతేకాదు వాటిపై మాయిశ్చరైజర్ లేదా నూనెను అప్లై చేస్తే గోళ్లు ఎప్పుడూ అందంగా ఉంటాయి.

Grapes Juice: ద్రాక్షరసం తాగుతూ ఎప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవద్దు.. ఎందుకంటే..?

Joint Pains: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. జాగ్రత్త ఈ అవయవాలపై ఎఫెక్ట్..!

Diabetes: మధుమేహ బాధితులు అలర్ట్‌.. పరగడుపున షుగర్ లెవల్స్‌ ఎందుకు పెరుగుతాయో తెలుసా..?