Loneliness Health Issues: ఒంటరితనం వల్ల ఈ 5 తీవ్రమైన వ్యాధులు వచ్చే ఛాన్స్.. రావొద్దంటే ఇది చేయాల్సిందే..

మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయని అనేక మంది ఆరోగ్య నిపుణులు, అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సమాజంలో తోటి వ్యక్తులతో కలిసి ఉండకపోవడం, ఒంటరిగా ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తాయి.

Loneliness Health Issues: ఒంటరితనం వల్ల ఈ 5 తీవ్రమైన వ్యాధులు వచ్చే ఛాన్స్.. రావొద్దంటే ఇది చేయాల్సిందే..
Loneliness Health Issues

Updated on: Mar 24, 2023 | 10:43 PM

మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయని అనేక మంది ఆరోగ్య నిపుణులు, అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సమాజంలో తోటి వ్యక్తులతో కలిసి ఉండకపోవడం, ఒంటరిగా ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అనేక వ్యాధులను ప్రేరేపిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అధ్యయనాల ప్రకారం.. ఒంటరితనం అకాల మరణానికి దారి తీస్తుంది. అంతేకాదు.. ఒంటరితనం కారణంగా గుండె జబ్బులు, డిప్రెషన్, ఆందోళన, మధుమేహం,అధిక రక్తపోటు వంటి వ్యాధులకు కూడా దారితీస్తుంది. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఆసుపత్రులకు వెళ్లే చాలా మంది రోగులు సైకోసిస్‌తో బాధపడుతున్నారని తేలింది. అంటే వారికి ఎలాంటి శారీరక సమస్య, నష్టం లేదని అర్థం. మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, ఇష్టమైన వారి ఎడబాటు, మరణం, విడిపోవడం, మానసిక గాయం మొదలైనవి ఒంటరితనానికి దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఒంటరితనం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు:

డిస్టిమియా, పెర్సిస్టెంట్ డిప్రెషన్: ఒంటరితనం వల్ల వచ్చే ప్రధాన రుగ్మతల్లో ఇది ఒకటి. దీనితో బాధపడే వ్యక్తి శారీరక రుగ్మతలేమీ లేకపోయినా ఎప్పుడూ ఒంటరిగా ఉండాలనీ, ఎవరితోనూ సహవాసం చేయకూడదనీ కోరుకుంటాడు.

సామాజిక ఆందోళన: సామాజిక ఆందోళన రుగ్మత ఉన్న వ్యక్తులు ఇతర వ్యక్తులతో మాట్లాడటానికి భయపడతారు. ఈ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు సామాజికంగా మాట్లాడటానికి సిగ్గుపడటం గానీ, భయపడటం చేస్తారు.

ఇవి కూడా చదవండి

దీర్ఘకాలిక వ్యాధులు: ఒంటరితనం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక శారీరక సమస్యలు తలెత్తుతాయి.

హార్మోన్ల అసమతుల్యత: ఒంటరితనం, ఒత్తిడి కారణంగా హార్మోన్ల మార్పులు వస్తాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

మధుమేహం: టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం, అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఒంటరితనం మధుమేహ వ్యాధిని తీవ్రతరం చేస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..