Calcium: తరచూ అలసట, కాళ్లు, చేతులు నొప్పి అనిపిస్తోందా? ఐతే ఇది కారణం కావచ్చు..

|

Aug 21, 2022 | 7:26 PM

ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, ఖనిజాలతోపాటు ఇతర పోషకాలు చాలా అవసరం. ముఖ్యంగా కాల్షియం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఖనిజం. కాల్షియం లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు..

Calcium: తరచూ అలసట, కాళ్లు, చేతులు నొప్పి అనిపిస్తోందా? ఐతే ఇది కారణం కావచ్చు..
Calcium Deficiency
Follow us on

Calcium Deficiency Symptoms in Telugu: ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, ఖనిజాలతోపాటు ఇతర పోషకాలు చాలా అవసరం. ముఖ్యంగా కాల్షియం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఖనిజం. కాల్షియం లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్లనే కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. శరీరంలో కాల్షియం లోపాన్ని ఈ విధంగా గుర్తించవచ్చు.

కాల్షియం లోపిస్తే జుట్టు పొడి బారిపోతుంది. అంతేకాకుండా జుట్టు నెమ్మదిగా పెరుగుతుంది. ఎక్కువగా స్ట్రెస్‌ (ఒత్తిడి)కు గురవుతుంటారు. గోళ్లు విరిగిపోవడం, దంతాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. సరిపడా కాల్షియం లేకపోతే చేతులు, కాళ్ళలో నొప్పి, కండరాల నొప్పులు తలెత్తుతాయి. శరీరంలో కాల్షియం మరింతగా లోపిస్తే చేతులు, కాళ్ళు మొద్దుబారడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తప్పక తీసుకోవల్సి ఉంటుంది. తక్కువ కాల్షియం కారణంగా త్వరగా అలసి పోవడం, స్పృహ తప్పడం జరుగుతుంది. ఎముకలు బలహీన పడి గాయాలు, పగుళ్లు ఏర్పడతాయి.

ఏయే ఆహారాల్లో కాల్షియం అధికంగా ఉంటుందంటే..

  • సోయాబీన్స్, సోయా పాలు వంటి సోయా ఆహార ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ ఉత్పత్తుల్లో విటమిన్ ‘డి’ కంటెంట్‌ కూడా ఎక్కువే. ఈ ఆహారాలు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
  • ఆకు కూరల్లో కూడా కాల్షియం నిండుగా ఉంటుంది. ముఖ్యంగా బచ్చలికూర, క్యాబేజీ, బ్రొకోలీ, పాలకూర వంటి ఆకుకూరలు ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
  • పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలు దృఢపరుస్తాయి. అలాగే గుడ్డులో ప్రొటీన్లు, క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. గుడ్లు ఎముకలను బలోపేతం చేయడానికి పని చేస్తాయి.