Cardamom for Health: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది జీవిత సత్యం. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కంటే భాగ్యవంతులు మరొకరు లేరని అర్థం. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రతి భారతీయ వంటగదిలో కనిపించే సుగంధద్రవ్యాలు ఎంతగానో ఉపయోగకపడతాయి. ముఖ్యంగా ఏలకులు ఆరోగ్యాన్ని కాపాడడంలో మెరుగ్గా పనిచేస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగంగా రాత్రి భోజనం తర్వాత తీసుకుంటే అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే గుండె సమస్యలకు ప్రధాన కారణమైన కొలెస్ట్రాల్‌ని కూడా నిరోధించవచ్చు. ఇంకా ఏలకులతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఏలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. భోజనం తర్వాత ఏలకులు తింటే అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు మన దరిచేరవు. ఇంకా ఏలకులను తినడం వల్ల కడుపులోని ఎంజైమ్‌లు ఉత్తేజితమై ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అలాగే ఏలకులను నమలడం లేదా చప్పరించడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది. అలాగే నోటిటోని హానికరమైన బ్యాక్టీరియా నశించిపోతాయి. ఇవే కాక రక్తపోటును నియంత్రిడంలో, కొలెస్ట్రాల్‌ని నియంత్రించడంలో ఏలకులు సహాయపడతాయి. ఏలకులు తినడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఏలకులు బరువు తగ్గాలనకునేవారికి కూడా సహకరిస్తాయి. శరీరంలోని కొవ్వును వేగవంతంగా కరిగించడంలో ఇవి ఉత్తమమైన ఎంపిక. ముందుగా చెప్పుకున్నట్లుగా వీటిని తింటే అజీర్తి సమస్యలు తొలగిపోయి బరువు కూడా తగ్గుతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..