ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదాన్ని ఫాలో అవుతున్నాం. అనారోగ్య సమస్యలకు వంటింట్లో లభించే వస్తువులతో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో అల్లం, పసుపు ఒకటి. వంటింట్లో కచ్చితంగా ఉపయోగించే ఈ రెండింటితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా పసుపును అల్లాని పొడి రూపంలోకి మార్చుకుని కలిపి తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రెండింటిని కలిపి తీసుకుంటే జీర్న సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు దరి చేరవు. పసుపులో ఉండే కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అల్లంలో ఉండే జింజరాల్‌లో కూడా యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీంతో ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
పసుపు, అల్లంలో ఉండే విటమిన్ సి, విటమిన్ b6, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, విటమిన్ ఈ, విటమిన్ కె వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మెదడు పనితీరును మెరుగు పరచడంలో కీలక పాత్రపోషిస్తాయి. తరచూ వచ్చే వ్యాధులను తరిమికొట్టడంలో కూడా అల్లం, పసుపు బాగా ఉపయోగపడుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. పసుపు, అల్లం పొడిని కలిపి పాలలో కలుపుకొని తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాల నొప్పులు కూడా దూరమవుతాయి.
శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా పసుపు, అల్లం పొడి ఉపయోగపడుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే సమస్య తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో రక్తపోటు తగ్గుతుంది. ఇక మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో కూడా అల్లం, పసుపు పొడి బాగా ఉపయోగపడుతుంది. పసుపులోని కర్కుమిన్ సమ్మేళనం మెదడును కాపాడుతుంది. చిన్నారుల్లో జ్ఞాపక శక్తిని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..