నేటి బిజీ లైఫ్‌లో ప్రజలు, ఉద్యోగులు రోజులో ఎక్కువ సమయం కూర్చొని గడుపుతున్నారు. ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఐటీ సెక్టార్ సహా వివిధ రంగాల వారికి గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం అలవాటు. పెద్దగా నడవడం తగ్గిపోయింది. అంతేకాదు.. ప్రజలు తమ రోజు వారి దినచర్యలతో చాలా బిజీగా ఉంటున్నారు. తినడం,తాగటం సమయాలను పక్కన పెడితే, సాధారణ నడక వ్యాయామం చేయడానికి కూడా తగినంత సమయం లేదు. కానీ,వాకింగ్ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. ఇది విశ్వాసం, మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. చాలా మంది ఫిట్ గా ఉండేందుకు రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. ప్రతి ఒక్కరూ వారి సౌకర్యం, ప్రాధాన్యత ప్రకారం వ్యాయామాన్ని ఎంచుకుంటారు.
ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 20 నిమిషాలు నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కూర్చునే వ్యాయామం వాకింగ్ వంటి ప్రయోజనాలను అందించదు. రోజుకు కనీసం కొద్ది దూరం నడవడం వల్ల కండరాలు ఉత్తేజితమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కూర్చోవడం వల్ల కాళ్లలోని రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది. ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. రక్తపోటును పెంచుతుంది. కేవలం 20 నిమిషాల నడక వల్ల బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిరోజూ 20 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఇక్కడ తెలుసుకుందాం..
బరువు తగ్గడం..
బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నడక కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడే మంచి కార్డియో వ్యాయామం. బరువు తగ్గాలంటే రోజుకు 20 నిమిషాలు వాకింగ్ చేయడం మంచిది.
ఈ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది..
రోజుకు 20 నిమిషాలు నడవడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. నడక గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడక కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
మానసిక ఆరోగ్య..
రోజుకు 20 నిమిషాలు నడవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నడక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది విశ్వాసం, మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
బలమైన ఎముకలు, కండరాలు..
నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నడక ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి, సమతుల్యత, సమన్వయాన్ని మెరుగుపరచడానికి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నడక శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది మీ శరీరంలోని సోమరితనాన్ని వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..