Health benefits of Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలు చాలా రుచికరమైనవి.. వీటిలో అనేక పోషకాలు దాగున్నాయి. అదే సమయంలో గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతుంది. ఇవి కొవ్వును తగ్గించి.. బరువును క్రమంగా తగ్గేలా చేస్తాయి. గుమ్మడికాయ గింజలను ఏ విధంగానైనా తినవచ్చు. ఇవి తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి.. అందుకే అధిక బరువుతో బాధపడుతున్నవారికి ఉత్తమమైనవి. అయితే.. వీటిని కొన్ని కొన్ని విధాలుగా తీసుకోవడం ద్వారా బరువు వేగంగా తగ్గడంతోపాటు.. శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి. అయితే. గుమ్మడికాయ గింజలను ఎలా తినాలి.. ఎప్పుడు తీసుకోవాలి..? వీటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బరువును తగ్గిస్తాయి: గుమ్మడి గింజలను అల్పాహారంగా తీసుకోవడం వల్ల మీకు మేలు చేకూరుతుంది. ఇందులో క్యాల్షియం, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ప్రారంభ బ్రేక్‌ఫాస్ట్‌లో దీన్ని తీసుకోవడం వల్ల మీకు ఆకలి తగ్గుతుంది. దీని కారణంగా అతిగా తినడం సమస్య నుంచి బయటపడొచ్చు.. ఇంకా ఊబకాయం కూడా పెరగదు.
గుండెకు మేలు చేస్తాయి: ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతే కాకుండా గుమ్మడి గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు.
గుమ్మడికాయ గింజలను ఎలా తీసుకోవాలి..
గుమ్మడికాయ గింజలను స్నాక్స్‌గా లేదా సలాడ్‌లో కలిపి తినవచ్చు. మీరు ఉదయం ఖాళీ కడుపుతో కూడా తినవచ్చు. ఏదైనా తినాలనుకున్నప్పుడు వీటిని తింటే.. ఆకలి కోరిక తీరడంతోపాటు.. అధిక కేలరీలను నియంత్రించుకోవచ్చు.
ఎంత మోతాదులో తీసుకోవాలి?
గుమ్మడికాయ గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. రోజూ మితంగా మాత్రమే తీసుకోవాలని సూచిటపేగతపతాకగ. దీన్ని అవసరానికి మించి తీసుకుంటే అపానవాయువు లేదా కడుపు నొప్పి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..