Benefits of Jackfruit: ఆరోగ్యవంతంగా ఉండేందుకు చాలా రకాల పండ్లు దోహదపడుతుంటాయి. అలాంటి పండ్లల్లో పనస పండు ఒకటి. పనస పండును జాక్ ఫ్రూట్ అంటారు. పనస పండు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండు తొనల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో మానసిక ఉల్లాసం పెరిగి.. అలసట తగ్గతుంది. చర్మ సౌందర్యంతోపాటు ఆరోగ్యవంతంగా ఉండేలా పనస సహకరిస్తుంది. నాన్-వెజ్ లాంటి పోషకాలున్న ఈ జాక్‌ఫ్రూట్‌ను శాఖాహారులు ఇష్టంతో తింటారు. పనస తొనలతో తయారు చేసిన స్పైసీ గ్రేవీని ప్రజలు అన్నంతో ఎంతో ఇష్టంగా తింటారు. శుభకార్యాల్లో కూడా జాక్‌ఫ్రూట్‌ను పలు రకాలుగా వడ్డిస్తారు.
అదే సమయంలో కొంతమంది దాని గింజలను ఉడికించిన తర్వాత తింటారు. ఇవి తీపిగా, రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జాక్‌ఫ్రూట్‌లో లభించే పోషకాలు మీ జీర్ణవ్యవస్థ, గుండె, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అలాగే మధుమేహం, రక్తహీనతను నివారించడంలో కూడా పనస పండు సహాయపడుతుంది. జాక్‌ఫ్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తహీనతను నివారిస్తుంది: శరీరంలో ఐరన్ లోపం ఉంటే జాక్‌ఫ్రూట్ తినండి. ఇది రక్తహీనతను నివారించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
అధిక బీపీని నియంత్రిస్తుంది: జాక్‌ఫ్రూట్‌లో ఉండే పొటాషియం గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
జీర్ణక్రియకు మేలు చేస్తుంది: జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే పండిన జాక్‌ఫ్రూట్ గింజలను తినండి. ఇది మీ సమస్యను దూరం చేస్తుంది. జాక్‌ఫ్రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీని కారణంగా మలబద్ధకం కూడా దూరమవుతుంది.
రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది: పనస పండులో అధికంగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. కావున ఆహారంలో జాక్‌ఫ్రూట్‌ను చేర్చుకోవడం చాలామంచిది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..