AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mint health benefits: పుదీనా మజాకా..! అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

వంటల్లో పుదీనా వేస్తే రుచి మారిపోతుంది. ఎందుకంటే దీని ఫ్లేవర్ అలా ఉంటుంది. పుదీనా ఆకుల్లోని విటమిన్‌ సి, రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. పుదీనాలో ఐరన్‌, మాంగనీస్‌, ఫోలేట్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీవక్రియ విధులు, కణాల పెరుగుదలకు తోడ్పడతాయి.

Mint health benefits: పుదీనా మజాకా..! అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Mint leaves
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2025 | 1:17 PM

Share

పుదీనా ఆకులు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతాయి. పుదీనాలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలు బిర్యానీ, మటన్ ,చికెన్ వండేటప్పుడు పుదీనా ఆకులు వేస్తే అద్భుతమైన రుచి కలిగి ఉంటాయి.

వర్షకాలం వచ్చిందంటే చాలు జలుబు, ముక్కుదిబ్బడ వంటి సమస్యు ఎదురవుతుంటాయి.. ఈ క్రమంలో పుదీనా ఆకుల వాసన పీల్చితే ఉపశమనం లభిస్తుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. పేలు , చుండ్రు సమస్యలను తొలగిస్తాయి. వంటల్లో పుదీనా వేస్తే రుచి మారిపోతుంది. ఎందుకంటే దీని ఫ్లేవర్ అలా ఉంటుంది. పుదీనా ఆకుల్లోని విటమిన్‌ సి, రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. పుదీనాలో ఐరన్‌, మాంగనీస్‌, ఫోలేట్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీవక్రియ విధులు, కణాల పెరుగుదలకు తోడ్పడతాయి.

ప్రతి రోజూ ఉదయం పుదీనా ఆకులు, పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం సమస్యలు దూరం అవుతాయి. పుదీనా కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. పుదీనా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలు చర్మాన్ని సంరక్షిస్తాయి. పుదీనాలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ గుణాలు ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మ కణాలను రక్షిస్తాయి. పుదీనా చర్మానికి తాజాదనం అందిస్తాయి, రియాక్టివేట్‌ చేస్తాయి.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!