Eggs: రోజుకో గుడ్డు తింటే ఇన్ని లాభాలా? గుండె ఆరోగ్యానికి కొండంత బలం

|

Oct 13, 2024 | 2:05 PM

గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్‌తోపాటు ఇందులో అనేక ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. చర్మం నుంచి జుట్టు వరకు ప్రతిదానికీ గుడ్డు ఓ వరంగా చెప్పవచ్చు. రోజూ ఒక గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. గుడ్లలో ప్రొటీన్‌తో పాటు క్యాల్షియం కూడా ఎక్కువగా..

Eggs: రోజుకో గుడ్డు తింటే ఇన్ని లాభాలా? గుండె ఆరోగ్యానికి కొండంత బలం
ఎక్కువ రోజులు గుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి తినడం వల్ల.. వాటి పోషకాలు అందకపోగా.. ఇతర అనారోగ్య సమస్యలు ఎటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
Follow us on

గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్‌తోపాటు ఇందులో అనేక ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. చర్మం నుంచి జుట్టు వరకు ప్రతిదానికీ గుడ్డు ఓ వరంగా చెప్పవచ్చు. రోజూ ఒక గుడ్డు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. గుడ్లలో ప్రొటీన్‌తో పాటు క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం, విటమిన్ బి12, విటమిన్ డి, పొటాషియం, రైబోఫ్లావిన్, నియాసిన్, థయామిన్, ఫోలేట్, విటమిన్ ఎ, రెటినోల్, లుటిన్, జియాక్సంథిన్, విటమిన్ ఇ, విటమిన్ డి, సెలీనియం, జింక్, వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఒక వయోజన వ్యక్తి రోజుకి 2 గుడ్లు తీసుకుంటే, ఎముకలు బలంగా తయారవుతాయి. జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే లుటిన్, జియాక్సంతిన్ మూలకాలు, విటమిన్ ఎ కంటి చూపుకు మేలు చేస్తాయి. కోడిగుడ్లలో ఉండే సెలీనియం, బి12, విటమిన్ డి, ప్రొటీన్ మొదలైనవి కండరాలను దృఢంగా ఉంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు మెదడు, గుండెకు కూడా మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు గుడ్డులోని తెల్లసొనను ఆహారంలో చేర్చుకోవచ్చు. గుడ్డు తినడం వల్ల జుట్టు లోపలి నుంచి బలపడుతుంది.

గుడ్డులోని అనేక విటమిన్లు, ఖనిజాలు, సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం గుడ్లు తిననివారు కూడా చర్మానికి గుడ్డు ప్యాక్‌లను వాడుతున్నారు. గుడ్డులోని తెల్ల సొన ఒక గిన్నెలో వేసి, అందులో చెంచా తేనె, సమాన మొత్తంలో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే అందులో దోసకాయ రసాన్ని జోడించవచ్చు. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం మాయిశ్చరైజర్ రాసుకోవాలి. గుడ్డు చర్మం ఛాయను మెరుగుపరచడమే కాకుండా వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది కూడా. అంతేకాకుండా ఇది మొటిమలు, సూర్యరశ్మి, కాలుష్యం వల్ల కలిగే చర్మ నష్టం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. గుడ్డు తినడం వల్ల గోళ్లకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ, ప్రొటీన్లతో పాటు బయోటిన్ కూడా ఉంటుంది. బలమైన గోర్లు కావాలంటే, గుడ్డు తినవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.