Goat Milk Benefits : మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం..!

|

Dec 22, 2024 | 11:23 AM

అయితే, డెంగ్యూ చికిత్సలో దీనికి శాస్త్రీయ ఆధారం లేదు. ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ మేక పాలు తాగాలి. ఇందులో కాల్షియం ఉంటుంది. హై బీపీలో మేక పాలు అమృతం కంటే తక్కువ కాదు. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

Goat Milk Benefits : మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం..!
Goat Milk
Follow us on

మేక పాలు.. ఆయుర్వేదంలో ఔషధ నిధిగా పిలుస్తారు. ఎందుకంటే.. మేక పాలలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. తరచూ మేకపాలు తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తు్న్నాయి. లాక్టోస్ అసహనం ఉన్నవారికి కూడా మేక పాలు తీసుకోవడం, జీర్ణం చేయడం సులభం అవుతుంది. సాధారణ ఆవు పాలను జీర్ణం చేయడంలో సమస్య ఉంటే మేక పాలు తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మీకు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

మేక పాలలో కాల్షియం, ప్రొటీన్లు, కేలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్స్ విటమిన్లు, ఫాస్పరస్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. మేక పాలు గుండె రోగులకు దివ్యౌషధం కంటే తక్కువ కాదు ఎందుకంటే ఈ పాలలో మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. మీరు మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మేక పాలలో లినోలిక్ యాసిడ్ ఉంటుంది. జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే మేక పాలు తాగాలి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,..మేకపాలలో డజనుకు పైగా పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు B6, B12, C, D ఉన్నాయి. ఇవి శరీరంలో ఫోలిక్ యాసిడ్ మొత్తాన్ని పెంచడంలో సహాయపడతాయి. అయితే, డెంగ్యూ చికిత్సలో దీనికి శాస్త్రీయ ఆధారం లేదు. ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ మేక పాలు తాగాలి. ఇందులో కాల్షియం ఉంటుంది. హై బీపీలో మేక పాలు అమృతం కంటే తక్కువ కాదు. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మేక పాలలో అధిక మొత్తంలో సెలీనియం ఉంటుంది. అయితే ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో సెలీనియం గణనీయమైన సహకారం లేదు. అందువల్ల, డెంగ్యూ రోగులకు ప్లేట్‌లెట్లను పెంచడానికి మేక పాలను ఒక ఔషధంగా చూడటం ఒక అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.