Banana Flower: డయాబెటిస్‌కు ఈ పువ్వు ఓ వరం.. తరచూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..

ఒకసారి డయాబెటిస్‌ బారిన పడ్డవారు దానిని పూర్తిగా తగ్గించుకోలేరు.. కానీ, కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం కొందరు మందులు వాడుతుంటారు. మరికొందరు ఇన్సూలిన్‌ తీసుకుంటూ ఉంటారు. అయితే, డయాబెటిస్‌కు అరటి పువ్వు అద్భుత వరంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం...

Banana Flower: డయాబెటిస్‌కు ఈ పువ్వు ఓ వరం.. తరచూ తింటే ఈ సమస్యలన్నీ దూరం..
Banana Flower

Updated on: Jun 07, 2025 | 5:59 PM

ప్రస్తుత కాలంలో మధుమేహం ఒక సాధారణ అనారోగ్య సమస్యగా మారిపోయింది. ఎందుకంటే.. నేటి కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనేక మంది ఈ చక్కెర వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి డయాబెటిస్‌ బారిన పడ్డవారు దానిని పూర్తిగా తగ్గించుకోలేరు.. కానీ, కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం కొందరు మందులు వాడుతుంటారు. మరికొందరు ఇన్సూలిన్‌ తీసుకుంటూ ఉంటారు. అయితే, డయాబెటిస్‌కు అరటి పువ్వు అద్భుత వరంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…

డయాబెటిస్‌కు అరటిపువ్వు దివ్య ఔషధం అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. అరటిపువ్వుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయని చెబుతున్నారు. అరటి పువ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచుతాయి. అరటి పువ్వులో ఉండే ఫైబర్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అరటిపువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌‌ని దూరం చేస్తాయి. దీని వల్ల ఇన్‌ఫ్లమేషన్ దూరమవుతుంది. క్రోనిక్ డిసీజెస్ కూడా తగ్గుతుంది.

అరటి పువ్వులో మెగ్నీషియం అధికం అధికంగా ఉంటుంది. అరటిపువ్వులోని మెగ్నీషియం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అరటిపువ్వులో విటమిన్ బి6లు కూడా ఉంటాయి. ఇవి ఆడవారిలో మెనుస్ట్రువల్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసి వారి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా ఇందులోని విటమిన్ ఎ, సీ, పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల సమస్యల్ని దూరం చేస్తాయి.
శరీరంలోని కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఈ కథనంలోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైనా సమస్యలున్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..