Benefits Of Dates: రోజుకు 2 ఖర్జూరాలు తినడం అలవాటు చేసుకోండి.. ఈ వ్యాధుల నుండి దూరంగా ఉంటారు..!

|

Mar 06, 2024 | 6:52 AM

ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ముఖ కాంతిని పెంచడంతో పాటు జుట్టు ఆయుష్షును కూడా పెంచుతుంది. ఇది అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. ఖర్జూరంలోని పోషకాలను పొందాలంటే.. రోజుకు 2 ఖర్జూరాలు మాత్రం తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి రిజల్ట్స్‌ కోసం వారం పాటు క్రమం తప్పకుండా తినాలని అంటున్నారు.

Benefits Of Dates: రోజుకు 2 ఖర్జూరాలు తినడం అలవాటు చేసుకోండి.. ఈ వ్యాధుల నుండి దూరంగా ఉంటారు..!
Benefits Of Dates
Follow us on

నేడు వేగంగా మారుతున్న జీవనశైలిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడం సవాలుతో కూడుకున్నది. సమయాభావం వల్ల చాలాసార్లు వ్యాయామం, యోగా చేయడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ప్రజలు వివిధ పద్ధతులను ఎంచుకుంటారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆహార నియంత్రణను కూడా మెరుగుపర్చుకోవాలి. హెల్త్‌ డైట్‌లో భాగంగా చాలా మంది ఖర్జూరాన్ని ఆహారంలో ఉపయోగిస్తారు. ఖర్జూరాలతో రోజుని ప్రారంభిస్తే.. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఖర్జూరాలు టేస్ట్‌లోనూ అంతే మధురంగా ఉంటాయి. అందుకే వీటిని అందరూ ఇష్టంగా తింటారు. ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో వీటిని ఔషదాల తయారీలోనూ ఉపయోగిస్తారు. నిపుణుల ప్రకారం.. రోజుకు రెండు ఖర్జూరం పండ్లు తింటే.. ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, ఖర్జూరంలో సెలీనియం, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్‌, కాపర్‌, మెగ్నీషియంతో సహా 15 మినరల్స్‌ ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌ కణాలతో పోరాడతాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి. ఖర్జూరంలో 23 అమైనో యాసిడ్స్‌, పాల్మిటోలిక్‌, ఒలీక్, లినోలెయిక్, లినోలెనిక్ యాసిడ్‌‌‌‌ వంటి అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్నాయి. ఖర్జూరం గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. దీని వాడకం వల్ల మలబద్ధకం, జీవక్రియ, అధిక బరువు మొదలైన సమస్యలు దరిచేరవు. ఖర్జూరంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, ఫోలేట్, ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. దీంతో అనేక రకాల వ్యాధులు నయమవుతాయి.

ఖర్జూరాల్లో ఫ్రక్టోజ్ లభిస్తుంది. మీరు ఖాళీ కడుపుతో ఖర్జూరాన్ని తీసుకుంటే, అది కడుపు నొప్పిని కలిగిస్తుంది. ఖర్జూరం కడుపు నిండా తినడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆహారం తిన్న తర్వాత కడుపు నిండుగా ఉంటుంది. ఖర్జూరంలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పెంచుతుంది. ఇది వాపుకు కారణం కావచ్చు. మీరు బ్రేక్‌ఫాస్ట్‌ కోసం లేదా రోజులో ఎప్పుడైనా ఖర్జూరాన్ని తినవచ్చు. ఖర్జూర పండ్లను ఉదయాన్నే తింటే శక్తి లభిస్తుంది. దీని వల్ల పేగు పురుగులు కూడా చనిపోతాయి. ఖర్జూరాన్ని ఉదయాన్నే తినడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. గుండె, కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ముఖ కాంతిని పెంచడంతో పాటు జుట్టు ఆయుష్షును కూడా పెంచుతుంది. ఇది అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంది. ఖర్జూరంలోని పోషకాలను పొందాలంటే.. రోజుకు 2 ఖర్జూరాలు మాత్రం తింటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి రిజల్ట్స్‌ కోసం వారం పాటు క్రమం తప్పకుండా తినాలని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..