
వేరుశెనగ తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ఈ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, వేరుశెనగకు అనేక ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వేరుశెనగకు అలెర్జీ ఉన్నవారు వాటిని తినకుండా ఉండాలని చెబుతున్నారు. ఎందుకంటే అవి గొంతు నొప్పి, చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు, శ్వాస ఆడకపోవడానికి కారణమవుతాయి. కొంతమందికి పల్లీలు పడవు. వీరికి పల్లీలు తినగానే వాంతులు, పెదాలు ఉబ్బడం, నాలుక మొద్దుబారిపోవడం, గొంతు వాచినట్లుగా అవ్వడం జరుగుతుంది. ఇలాంటి వారు పల్లీలకు దూరంగా ఉండటం మేలు.
ఆస్తమా వంటి శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు పల్లీలు తినకపోవడమే మంచిది. ఇది ఈ సమస్యలను మరింత పెంచుతుంది. అందుకే శ్వాస సమస్యలు ఉంటే జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు వంటివి తినడం మేలు. పల్లీలు తినగానే కొంతమందికి చర్మంపై ర్యాషెస్ వస్తాయి. ఇలా దద్దుర్లు వస్తే కూడా పల్లీలకు వీలైనంత దూరంగా ఉండటం మేలు.
ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సంబంధ సమస్యలు ఉన్నవారు కూడా పల్లీలు తినొద్దు. ఎందుకంటే పల్లీలు లివర్‌లో కొవ్వు పెంచి సమస్యను తీవ్రతరం చేస్తాయి. రక్తం పల్చబడటం కోసం కొంతమంది మెడిసిన్ వాడుతుంటారు. ఇలాంటి వారు పల్లీలు తీసుకోకపోవడమే మంచిది. పల్లీలలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలను మరింత పెంచుతుంది. అందుకే దీర్ఘకాల కిడ్నీ సమస్యలు ఉన్నవారు పల్లీలకు దూరంగా ఉండాలి. పల్లీలు ఎక్కువగా తింటే బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పల్లీలను మితంగా తీసుకోవడం మంచిది.
ఎలా తినాలి?:
ఉడికించిన లేదా వేయించిన పల్లీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ ఉప్పు కలిపిన, డీప్ ఫ్రై చేసిన పల్లీలు అస్సలు తినకూడదు. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 50గ్రాముల పల్లీలు తినడం మంచిది. బరువు తగ్గాలని చూసేవారు రోజుకు 30గ్రాములకు మించి పల్లీలు తీసుకోకపోవడమే మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..