Hair Care: ఒత్తయిన, పొడవాటి జుట్టు కోసం ఈ 3 పదార్థాలను నీటిలో కలిపి తలకు పట్టించండి..

|

Dec 05, 2022 | 10:14 AM

ఈ నీటితో మీ జుట్టును వారానికి రెండు లేదా మూడు సార్లు కడగాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పెరగడమే కాకుండా మూలాలకు బలం చేకూరుతుంది.

Hair Care: ఒత్తయిన, పొడవాటి జుట్టు కోసం ఈ 3 పదార్థాలను నీటిలో కలిపి తలకు పట్టించండి..
Hair Care Tips
Follow us on

చలికాలంలో జుట్టు సంరక్షణ : సాధారణంగా జుట్టు పెరగడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా తలస్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలిపి జుట్టును కడగడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. జుట్టు పెరుగుదల, సంరక్షణ కోసం పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం…

అవిసె గింజలు:
అవిసె గింజల నీటిలో విటమిన్ ఇ, ప్రోటీన్ రెండూ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అవిసె గింజల నీటితో జుట్టును కడిగితే, జుట్టు పెరుగుతుంది. ఇందుకోసం మీరు 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను రెండు గ్లాసుల నీటిలో నానబెట్టి, దానిని ఫిల్టర్ చేసి మరుసటి రోజు మీ జుట్టును కడగాలి. ఇలా చేయడం వల్ల అనేక జుట్టు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

నిమ్మకాయ :
నిమ్మకాయ నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. నీటిలో నిమ్మకాయ రసం పిండి.. ఈ నీటితో మీ జుట్టును వారానికి రెండు లేదా మూడు సార్లు కడగాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు పెరగడమే కాకుండా మూలాలకు బలం చేకూరుతుంది.

ఇవి కూడా చదవండి

బియ్యం కడిగిన నీరు:
బియ్యం కడిగిన నీరు జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి బియ్యాన్ని నానబెట్టండి. తర్వాత ఆ నీటితో మీ జుట్టును కడగాలి. ఇది జుట్టును బలోపేతం చేయడమే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో కూడా ఉపయోగపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి