Hair Care Tips: బట్టతల సమస్యకు బీట్‌రూట్ మందు! ఇంట్లోనే ఇలా హెయిర్ ప్యాక్ చేసుకోండి..

|

Nov 06, 2022 | 6:11 AM

బీట్‌రూట్‌ను సూపర్‌ఫుడ్‌గా పిలిస్తారు. బీట్‌రూట్ వ్యక్తి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. బీట్‌రూట్ ఆరోగ్యానికే కాదు జుట్టుకు

Hair Care Tips: బట్టతల సమస్యకు బీట్‌రూట్ మందు! ఇంట్లోనే ఇలా హెయిర్ ప్యాక్ చేసుకోండి..
Beetroot
Follow us on

బీట్‌రూట్‌ను సూపర్‌ఫుడ్‌గా పిలిస్తారు. బీట్‌రూట్ వ్యక్తి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. బీట్‌రూట్ ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. జుట్టును అందంగా మార్చడంలో బీట్‌రూట్ సహాయపడుతుంది. ఇది సహజమైనది, దీని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. మీరు కూడా బట్టతల బాధితులైతే, ఈ బీట్ రూట్ జ్యూస్‌ను ఉపయోగింవచ్చు. అవును, బల్లతల సమస్య తగ్గాలంటే.. బీట్ రూట్ హెయిర్ ప్యాక్ వినియోగించవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి బీట్ రూట్ ప్యాక్ ఎలా చేసుకోవాలి? దీనితో ప్రయోజనాలు ఏంటి? ఇతర వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..

బట్టతల సమస్యను తగ్గిస్తుంది..

బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ సహాయంతో జుట్టు రాలే సమస్యను తగ్గించవ్చు. దీంతో పాటు.. జుట్టు కూడా బలాన్ని పొందుతుంది. బీట్‌రూట్‌తో తయారు చేసిన హెయిర్ ప్యాక్‌ఎలా అప్లై చేయాలో చూద్దాం..

హెయిర్ ప్యాక్‌ కోసం కావాల్సినవి..

1. దుంప రసం కప్పు

ఇవి కూడా చదవండి

2. అల్లం రసం రెండు టేబుల్ స్పూన్లు

3. ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు

ఇలా హెయిర్ ప్యాక్ తయారు చేసుకోండి..

బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. ఆ తర్వాత అందులో అరకప్పు బీట్‌రూట్ జ్యూస్ కలపాలి. దానికి రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసం కలపాలి. 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కూడా కలపాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ రెడీ.

హెయిర్ ప్యాక్ ఎలా అప్లై చేయాలి?..

బీట్‌రూట్ హెయిర్ ప్యాక్‌ని జుట్టు మరియు స్కాల్ప్‌పై కొద్దిగా అప్లై చేయాలి. ఆ తరువాత జుట్టు, తలపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత జుట్టును మంచి నీటితో కడగాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు ఉపయోగించవచ్చు.

బట్టతల సమస్య నుండి ఉపశమనం..

బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ సహజమైనది. దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు, తలపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు సమస్య దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు బట్టతల సమస్య కూడా తగ్గుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..