జామపండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికీ తెలిసిందే..అలాంటి జామపండ్లు మాత్రమే కాదు.. జామ ఆకుల్లోనూ అలాంటి పోషకాలే పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో శరీరానికి అవసరమైన ఫైబర్‌తో పాటు విటమిన్ A సమృద్ధిగా లభిస్తుంది. దీంతో పాటు ఈ ఆకుల్లో విటమిన్ C, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాపర్, మాంగనీస్ కూడా ఉన్నాయి. ఇన్ని పోషకాలు నిండివున్న జామ ఆకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల బాడీకి బోలెడు లాభాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. ఆ లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
జామ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ మొదలైన కడుపు సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం జామ ఆకులను నమలండి.
జామ ఆకుల్లో చాలా బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. శరీరంలోని షుగర్‌ని తగ్గిస్తుంది.. అంతే కాదు ఖాళీ కడుపుతో జామ ఆకులను తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలో అధికంగా పేరుకున్న కొవ్వును కరిగించడంలోనూ జామాకు రసం అద్భుతంగా పనిచేస్తుంది.
జామ ఆకులు క్యాన్సర్‌కు దారితీసే కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్ కారక కణాల ఉత్పరివర్తనాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు అంటున్నారు నిపుణులు.
జామ ఆకుల్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జామ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, క్వెర్సెటిన్, గల్లిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇది పరోక్షంగా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..