AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఎన్ని లాభాలో తెలుసా..? జీర్ణక్రియ సమస్యలే కాదు.. క్యాన్సర్‌ను కూడా ఖతం చేస్తుందట..!

అంతే కాదు ఖాళీ కడుపుతో జామ ఆకులను తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలో అధికంగా పేరుకున్న కొవ్వును కరిగించడంలోనూ జామాకు రసం అద్భుతంగా పనిచేస్తుంది.

ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఎన్ని లాభాలో తెలుసా..? జీర్ణక్రియ సమస్యలే కాదు.. క్యాన్సర్‌ను కూడా ఖతం చేస్తుందట..!
Guava Leaves
Jyothi Gadda
|

Updated on: Dec 05, 2024 | 9:17 PM

Share

జామపండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికీ తెలిసిందే..అలాంటి జామపండ్లు మాత్రమే కాదు.. జామ ఆకుల్లోనూ అలాంటి పోషకాలే పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో శరీరానికి అవసరమైన ఫైబర్‌తో పాటు విటమిన్‌ A సమృద్ధిగా లభిస్తుంది. దీంతో పాటు ఈ ఆకుల్లో విటమిన్ C, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాపర్, మాంగనీస్ కూడా ఉన్నాయి. ఇన్ని పోషకాలు నిండివున్న జామ ఆకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల బాడీకి బోలెడు లాభాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. ఆ లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

జామ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ మొదలైన కడుపు సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం జామ ఆకులను నమలండి.

జామ ఆకుల్లో చాలా బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. శరీరంలోని షుగర్‌ని తగ్గిస్తుంది.. అంతే కాదు ఖాళీ కడుపుతో జామ ఆకులను తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. శరీరంలో అధికంగా పేరుకున్న కొవ్వును కరిగించడంలోనూ జామాకు రసం అద్భుతంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

జామ ఆకులు క్యాన్సర్‌కు దారితీసే కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్‌ కారక కణాల ఉత్పరివర్తనాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు అంటున్నారు నిపుణులు.

జామ ఆకుల్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జామ ఆకుల్లో ఉండే క్యాటెచిన్స్, క్వెర్సెటిన్, గల్లిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇది పరోక్షంగా బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
మసాలా ఫుడ్ తెగ లాగించేస్తున్నారా?.. తెల్లారి ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
వామ్మో.. ఈ 3 పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తింటే ఇంత డేంజరా?..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఆ స్టార్ హీరోని కౌగిలించుకోగానే తెగ సిగ్గు పడ్డాడు..
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏసీ లేకపోయినా టెన్షన్ లేదు! ఈ మొక్కలతో మీ ఇల్లు కూల్‌గా మారుతుంది
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
ఏనుగుకి కనిపించే రెండు దంతాలేనా.. నోట్లో ఇంకా పళ్లు ఉంటాయా?
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడాలిః రాజ్‌నాథ్
"పేదవారితో ఇళ్లు వేయించి కబ్జా చేస్తున్న వారిని పట్టుకోరా?:"
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు!