Hair Health: ఇది ఒక్కటి ఉంటే చాలు.. జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది..!

అలోవెరా చర్మ సంరక్షణకే కాదు.. జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. జుట్టు పొడిబారడం, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలకు అలోవెరా ఒక మంచి సహజ చికిత్సలా పని చేస్తుంది. ఇది జుట్టును తేమగా ఉంచి పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. కొన్ని సహజ పదార్థాలతో కలిపి అలోవెరాను ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు పొందవచ్చు.

Hair Health: ఇది ఒక్కటి ఉంటే చాలు.. జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది..!
Healthy Hair Tips

Updated on: May 26, 2025 | 4:32 PM

అలోవెరా గుజ్జులో కొద్దిగా స్వచ్ఛమైన కొబ్బరి నూనె కలిపి తలకు మసాజ్ చేయాలి. ఇది తల చర్మాన్ని తేమగా ఉంచి జుట్టు కుదుళ్లకు కావాల్సిన పోషణను అందిస్తుంది. ఈ మిశ్రమాన్ని తరచుగా వాడటం వల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి. నిమ్మలో ఉండే ఆమ్ల గుణాలు తల చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది చుండ్రును తగ్గించడంతో పాటు జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

ఆముదం నూనెను అలోవెరా గుజ్జుతో కలిపి తలపై పట్టించి కొంత సమయం ఉంచాలి. ఆ తర్వాత సున్నితంగా తలస్నానం చేయాలి. ఇది జుట్టు కుదుళ్లను బలంగా మార్చి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

పెరుగులో అలోవెరా మిశ్రమం కలిపి తలకు అప్లై చేయడం వల్ల తల చర్మం చల్లగా మారుతుంది. పెరుగులో ఉండే ఎంజైమ్‌ లు తల చర్మాన్ని శుభ్రపరిచి జుట్టును మెత్తగా, మృదువుగా ఉంచుతాయి.

మెంతులను నానబెట్టి పేస్ట్‌ లా చేసి దానిలో కలబంద గుజ్జు కలిపి తలపై అప్లై చేయాలి. ఈ మిశ్రమం తల చర్మానికి తేమను అందించడంతో పాటు జుట్టు రాలడాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

ఉసిరి పొడిలో అలోవెరా గుజ్జు కలిపి తలకు పట్టించాలి. ఇది జుట్టుకు సహజంగా నలుపు రంగు తీసుకురావడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జుట్టు బలంగా మారుతుంది.

కోడిగుడ్డు సొనలో కలబందను కలిపి తలపై రాసి కొంతసేపు వదిలి శుభ్రంగా కడగాలి. ఇది జుట్టుకు అవసరమైన ప్రోటీన్‌ ను అందించి జుట్టు పొడవుగా, మెత్తగా మారడానికి సహాయపడుతుంది.

గోరింటాకు పొడిని అలోవెరా గుజ్జుతో కలిపి తలకు పట్టించాలి. ఇది కేవలం జుట్టుకు రంగు ఇవ్వడమే కాకుండా.. జుట్టు బలంగా పెరగడంలో సహాయపడుతుంది.

ఈ సహజ మాస్కులు అన్నీ కూడా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని వారంలో ఒకటి లేదా రెండు సార్లు వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా, బలంగా, అందంగా ఉంటుంది.

(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే తలకు వాడాలి)